Shabbir ali vs chandrashekar rao

shabbir ali, kcr, mission kakatiya, contractors

congress senior leader shabbir ali attacks kcr, mission kakatiya. he said that kcr banefits to contractors on the mission kakatiya. kcr counter attack on that.

షబ్బీర్ తట్టలు మొయ్యి: కెసిఆర్

Posted: 03/12/2015 04:32 PM IST
Shabbir ali vs chandrashekar rao

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంట్రాక్టర్ ల కోసమే తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ స్కీమ్ ను ఆరంభించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయను ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రారంభించనున్న నేపథ్యంలో షబ్బీర్ కెసిఆర్ పై, మిషన్ కాకతీయపై విమర్శలు కురిపిస్తున్నారు.ఒక వైపు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే మరో వైపు మిషన్ కాకతీయ అంటూ కాంట్రాక్టర్లకు ఉపయోగపడే కార్యక్రమం చేపట్టారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రకటించినట్లు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే తానే స్వయంగా వెళ్లి ఆయనకి పూలమాల వేస్తానని,లేదంటే ప్రభుత్వంతో అమీతుమీ తెల్చుకునేందుకు దేనికైనా సిద్ధమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

అయితే కెసిఆర్ షబ్బీర్ అలీకి కౌంటర్ అటాక్ వేశారు. షబ్బీర్ అలి వచ్చి తట్టలు మొయ్యాలని పిలుపునిచ్చాడు. ఏ కార్యక్రమంలోనూ షబ్బీర్ కనిపించరని, సోనియా గాంధీ ఇంట్లో ఉండి, ఎమ్మెల్సీ అయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పనికి మాలిన మాటలు ఆపాలని షబ్బీర్ అలీకి సూచించారు. ఆకాశంపై ఉమ్మితే తిరిగి మొహం మీద పడుతుందని తెలిపారు. అలా షబ్బీర్ పై మాటల తూటాలు పేల్చారు కెసిఆర్.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shabbir ali  kcr  mission kakatiya  contractors  

Other Articles