Aakash joins trs

tollywood hero aakash joins trs party, hero aakash joins trs party, aakash joins trs, Telangana, cinema industry, Home Minister Naini, Akash hero of the film, TRS

tollywood hero aakash joins trs party

‘కారు’లో షికారు చేస్తున్న సినీహీరో ఆకాష్

Posted: 02/22/2015 01:03 PM IST
Aakash joins trs

టాలీవుడ్ నటుడు హీరో అకాష్ కారులో షికారు చేస్తున్నారు. అదేంటి ఆయన కారులో షికారుకు వెళ్తే మాకేంటి అనుకోమాకండి. ఎందుకంటే కారు అంటే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నం. ఇప్పడు అర్థమైయ్యింది కదూ. సినీ హీరో ఆకాష్ తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు గులాబి కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి. ఫిలించాంబర్ వద్ద జరిగిన కార్యక్రమంలో సినీ హీరో ఆకాష్ టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని, చిత్ర పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతం ఇదేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అమెరికా తరహాలో హైదరాబాద్‌లో సినిమా నిర్మాణానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని సూచించారు. సినిమా పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.

నిర్మాతలందరినీ ఒక్కచోట చేర్చి సినిమా టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునే విధంగా వనరులున్నాయని చెప్పారు. చంద్రబాబు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమ వాళ్లేనని సీఎం ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సినీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు పి.రామకృష్ణగౌడ్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  cini industry  Home Minister Naini  Akash hero of the film  TRS  

Other Articles