Asaduddin plays lage raho munnabhai with banglore police

asaduddin plays lage raho munnabhai, mp asaduddin gives flowers to banglore police, hyderabad parliament member asaduddin owasi, banglore police, banglore police issues notices to mp asududdin awasi,

hyderabad parliament member asaduddin plays lage raho munnabhai with banglore police

శంకర్ దాదా జిందాబాద్ అంటున్న ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ..

Posted: 02/19/2015 10:29 PM IST
Asaduddin plays lage raho munnabhai with banglore police

మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరులో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన ఎంఐఎం పార్టీ బహిరంగ సభకు  అనుమతిలేదని బెంగుళూరు నుంచి వచ్చిన కర్నాటక పోలీసులు ఆయనకు గురువారం నాడు నోటీసులు ఇచ్చారని సమాచారం. ఇటీవల ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ కు నో ఎంట్రీ ఛెప్పిన బెంగళూరు పోలీసులు.. అదే క్రమంలో మత విద్వేషాలను రెచ్చగోట్టే క్రమంలో అసుదుద్దీన్ కూడా అడ్టుకున్నారు.

అయితే, అసదుద్దీన్ ఓవైసీ మాత్రం వారి నోటీసులకు భిన్నంగా స్పందించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను అందుకున్న ఆయన వారికి పూలబొకేలు ఇచ్చి పంపించారని తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీన బెంగళూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మజ్లిస్ పార్టీ భావించింది. దీనికి పోలీసుల అనుమతిని కోరింది. కానీ కర్ణాటక పోలీసులు నిరాకరించారని సమాచారం. దీంతో అక్కడి పోలీసులు ఆయనకు బెంగళూరులో సభకు అనుమతి లేదని నోటీసులు అందచేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp asaduddin oyc  notices to asaduddin  banglore police  

Other Articles