Want ministry come to me says bihar cm manjhi

want ministry come to me says bihar cm manjhi, bihar chief minister jitin ram manjhi gives open ministry offer, bihar cm manjhi gives open ministry offer, bihar chief minister jitin ram manjhi, jdu leader nitish kumar, jdu president sharad yadav, patna high court, patna high court cancels vote of party expelled ministers, trust vote, governer kesarinath tripati,

bihar chief minister jitin ram manjhi gives an open ministry offer to party mlas after patna high court cancels right of vote to his party expelled ministers

‘‘మంత్రి పదవులు కావాలంటే ఇటు వైపుకు రండి’’

Posted: 02/19/2015 10:27 PM IST
Want ministry come to me says bihar cm manjhi

బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరగనున్న బీహార్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న తరుణంలో.. తనకు మద్దతు పలకిన వాళ్లకు మంత్రి పదవలను అందిస్తానని ఆయన పేర్కోన్నారు. మంత్రి పదవులను ఆశించే వాళ్లు తన  వద్దకు రావాలని ఓ బహిరంగ కార్యక్రమంలో ఆహ్వానం పలికారు. మరి కొన్నిగంటల్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న మాంఝీ ఈ వ్యాఖ్యలు చేయడం పలు విమర్శలకు దారి తీసింది. పాట్నాలోని ఎస్కే మెమోరియల్ హాల్లో మహాదళితులతో సమావేశమైన ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

మహాదళితుల గౌరవాన్ని కాపాడటమే తన లక్ష్యమని, తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఏమైనా చేస్తానని తెగేసి చెప్పారు. దీంతో బహిరంగంగా లంచం ఇస్తానని మాంఝీ అంటున్నారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై గుర్రుమన్నాయి. విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న మాంఝీ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే 117 మందికి పైగా శాసన సభ్యుల మద్దతు అవసరం ఉంది. అందుకే ఆయన మంత్రిపదవులు ఎరవేసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

ఇదిలావుండగా మాంఝీకి  పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. జేడీయూ కు చెందిన  ఎనిమిది మంది రెబల్ అభ్యర్థుల ఓటు వేసే అవకాశాన్ని రద్దుచేస్తూ  హైకోర్టు డబుల్ బెంచ్  ఆర్డర్ జారీ చేసింది. దీంతో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డట్టయింది.  అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా సంభవించిన ఈ పరిణామం మాంఝీకి  పెద్ద ఎదురు దెబ్బ.   ఫిబ్రవరి 20న విశ్వాస పరీక్షను ఎదుర్కో బోతున్న తరుణంలో కోర్డు   ఆర్డర్ గణనీయమైన ప్రభావం చూపించే   అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే  నితీష్, మాంఝీ ఇద్దరూ తమ బలాన్ని పెంచుకునే  పనిలో బిజీగా ఉన్నారు.   

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jitan Ram Manjhi  bihar cm  ministry offer  

Other Articles