Actor chandramohan health condition stable

actor chandramohan health condition stable, actor chandramohan, heart attack, chandra mohan on ventilator, chandramohan veteran hero, chandramohan hospitalized, chandramohan heart attack, chandramohan condition stable, chandramohan movies, chandramohan hits, chandramohanphots,

actor chandramohan health condition stable says apollo doctors

నిలకడగానే చంద్రమోహన్ ఆరోగ్యం

Posted: 02/19/2015 10:31 PM IST
Actor chandramohan health condition stable

గుండెపోటు కారణంగా జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు చంద్రమోహన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.  ప్రముఖ నటుడు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. రామానాయుడు అంత్యక్రియలు పూర్తయిన కొద్దిసేపటికే చంద్రమోహన్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారన్న వార్తలతో టాలీవుడ్ షాక్ అయ్యింది. చంద్రమోహన్‌కు గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 1966 నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా అనేక చిత్రాల్లో నటించారు. అయితే, చంద్రమోహన్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన మేనల్లుడు ప్రకటించారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని, అయన అభిమానులెవ్వరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదని చంద్రమోహన్ మేనల్లుడు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandramohan  Health Stable  Heart Attack  hospitalized  

Other Articles