Vijayamma lashes out on telugu state governments

vijayamma lashes out on telugu state governments, vijayamma inaugurates ysrcp telangana state office, telugu state governments, ysr congress party telangana state office, andhrapradesh and telangana, only words no actions says vijayamma, Y. S. Vijayamma, Honorary President of the YSR Congress Party, Telangana state office, inaugurates,

vijayamma inaugurates ysr congress party telangana state office and lashes out on telugu state governments

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలవి మాటలే.. చేతలు కరువు..

Posted: 02/15/2015 04:12 PM IST
Vijayamma lashes out on telugu state governments

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతలు కరువయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు.  అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అమె గుర్తు చేశారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా బారం మోపకుండా వైఎస్ పాలన సాగించారని అమె అన్నారు. ప్రస్తుత రాష్ట్రప్రభుత్వాలు ప్రజలపై ఛార్జీల భారన్ని మోపూతూ పేదలకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయని దుయ్యబట్టారు. వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బతికించుకుందామని... పార్టీని అందరం కలిసి ముందు తీసుకెళ్తామని వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోని తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ... ప్రతి నిమిషం ప్రజలకు ఏం చేయాలన్న తపనే వైఎస్ఆర్లో ఉండేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయపడాలన్నదే వైఎస్ఆర్ సంకల్పమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఆయన తపించారని చెప్పారు. వైఎస్ఆర్కు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడాల్లేవని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వమని ప్రజలందరూ భావించేలా కృషి చేశారని వైఎస్ విజయమ్మ తెలిపారు.
            
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Y. S. Vijayamma  Telangana state office  inauguration  

Other Articles