India won against pakistan

india won against pakistan, india scored 300 runs against pakistan, pakistan scored 224 runs, icc cricket world cup 2015, india score, virat kohli, shikar dhawan, suresh raina, umesh yadav, ravindra jadeja, ashwin, world cup scores, world cup photos, world cup stills, world cup india score, icc world cup. world cup

india won against pakistan in first world cup match with 76 runs

పాకిస్థాన్ పై చరిత్రను తిరగరాసిన భారత్

Posted: 02/15/2015 05:20 PM IST
India won against pakistan

ప్రపంచ కప్ పూల్ బిలోని తొలి మ్యాచ్లోనే టీమిండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆస్ట్రేలియాలోని అడిలైట్ లో జరిగిన పోరులో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇప్పటి వరకు లిఖించన చరిత్రనే మళ్లీ టీమిండియా మరో మారు లిఖించింది. టీమిండియా బ్యాట్స్మెన్ మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా 301 పరుగుల  భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్కు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లో 7 వికెట్లకు 300 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (107) సెంచరీకి తోడు సురేష్ రైనా (74), ధవన్ (73) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 300 మార్క్ చేరుకోగలిగింది. పాకిస్థాన్ బౌలర్ సొహైల్ ఖాన్ 5 వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైంది. టాప్ ఆర్డర్ పరవాలేదని అనిపించినా.. మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండర్లు క్రమంగా పెవిలీయన్ ముఖం పట్టడంతో ఇంకా మూడు ఓవర్లు మిగిలివుండగానే పాకిస్థాన్ అలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో షమీ నాలుగు విక్కెట్లు ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మలకు చెరో రెండేసి విక్కెట్లు, అశ్విన్, జడేజాలకు చెరో విక్కట్ లభించింది.

 

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc cricket world cup 2015  india  pakistan  

Other Articles