Andhrapradesh state special status not easy

Venkaiah naidu, central minister, Union minister for urban development venkaiah, andhrapradesh state, special status, delhi assembly elections, andhrapradesh cheif minister chandrababu naidu, Ap cm chandrababu,

andhrapradesh state special status not easy says venkaiah naidu

నవ్యాంధ్రకు ప్రత్యేకం.. కాదు అంత సులభం..

Posted: 02/15/2015 03:35 PM IST
Andhrapradesh state special status not easy

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తమకు సవాల్ విసిరాయన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పార్టీ ఓటమికి, ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో వెంకయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....అయినా ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో మా వ్యతిరేక పక్షాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దానిని సవాల్గా స్వీకరిస్తామన్నారు. దేశంలో పేదలకు, ధనికులకు మధ్య అంతరం తగ్గించేందకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నాగార్జున సాగర్ జలాల సమస్య గవర్నర్ సమక్షంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరు కలసి పరిష్కరించుకోవడం శుభపరిణామం అని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలన్నింటినీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇదే తరహాలో పరిష్కరించుకోవడం మంచిదని ఆయన ఆకాంక్షించారు..

ముందునుంచి చెబుతున్నట్లుగానే నవ్యంధ్రకు ప్రత్యేక హోదా అంత సులభం కాదని మరోమారు వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంత సులభతరం కాదని ఆనాడే చెప్పానని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీయేలో టీఆర్ఎస్ చేరతుంది అని విలేకర్లు ప్రశ్నించాగా... అవి ఊహాగానాలే అని తెలిపారు. బీహార్లో పరిణామాలకు మోదీకి సంబంధం లేదని, అది జనతా పరివార్ అంతర్గత సమస్య అని వెంకయ్య వెల్లడించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  andhra pradesh  special status  

Other Articles