Schedule released for andhrapradesh telangana mlc elections

MLC Elections, mlc schedule release, mlc election notification, Andhrapradesh, Telangana, graduate mlcs, teachers mlcs, professor nageshwar, mlc dilip kumar, mlc elections date, mlc elections counting, hyderabad rangareddy maboobnagar, nalgonda khammam warangal, godavari disrticts, krishna guntur, Teacher constituency

schedule released for andhrapradesh telangana mlc elections, notification on 19th, elections on march 16

ఏపీ, తెలంగాణ మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Posted: 02/11/2015 03:46 PM IST
Schedule released for andhrapradesh telangana mlc elections

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండళ్లకు ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్ ను ఒకేసారి విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. వివరాలను తెలిపింది. ఫిబ్రవరి 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ శాసనమండలి స్థానాలకు, తెలంగాణలో ఫట్టభద్రల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

నవ్యాంధ్రలోని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల ఉపాద్యయ నియోజకవర్గానికి ఉపాద్యయ కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. అటు తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రల నియోజకవర్గంతో పాటు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఫ్రోఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ దిలిప్ కుమార్ ల పదవీ కాలం ముగియడంతో ఇక్కడ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఏపీ తెలంగాణలోని శాసన మండలి ఎన్నికలు మార్చి 16న నిర్వహించనున్నారు. మార్చి 19న కౌంటింగ్ జరుపుతామని ఎన్నికల సంఘం వెల్లడించింది.

కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడమే అలస్యమన్నట్లు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఏ ఎస్ రామకృష్ణను అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ, ఉభయ గోదావరి ఉపాద్యయ నియోజకవర్గానికి చైతన్య రాజు పేరును ఖరారు చేసింది. షెడ్యూల్ వెలువడిన వెంటనే గంట లోపు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. వారిని బరిలోకి దింపింది

.జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLC Elections  Andhrapradesh  Telangana  

Other Articles