Court stay on nithesh election

jdu, nithesh kumar, cm manghee, bihar politics, bihar updates

court declare stay on nithsh election as a assembly leader. bihar cm manghee supporters make a pill in court.

కొనసా...గుతున్న బీహార్ రాజకీయాలు, కోర్టులో నితీష్ కు ఎదురుదెబ్బ

Posted: 02/11/2015 03:46 PM IST
Court stay on nithesh election

బీహార్ ఎన్నికలు టీవీలో వచ్చే సీరియల్ లా సాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయాలు భలే రంజుగా మారాయి. మాంఝీని సిఎం పదవి నుండి దించాలని జెడియు, నితీష్ వర్గం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.  మెజార్టీ కాదుందంటూ నితీష్ , మాంఝీ ఇద్దరూ గవర్నర్ ముందుకు వెళ్లారు. మొత్తానికి బీహార్ ఎపిసోడ్ ఎంతగా ముగియడం లేదు. తన మద్దతుదారులతో ఢిల్లీ బయలుదేరిన నితీష్ కుమార్ కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. జెడియు శాసనసభ నేతగా నితీష్ ఎన్నికపై మాంఝీ మద్దతుదారులు వేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. శాసన సభ నేతగా ఎన్నిక అయిన విధానాన్ని కోర్టు తప్పుపట్టింది. దాంతో బీహార్ ముఖ్యమంత్రి కావాలన్న నితీష్ కాళ్లకు కళ్లెం పడింది.

కాగా మరో పక్క మాంఝీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్న భాజపా ఎలా స్పందిస్తుందో ఎవరికి అంతుచిక్కడం లేదు. అసలే ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన భాజపా బీహార్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. నితీష్ కుమార్ మాత్రం వీలైనంత వరకు ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. అది కుదరని పక్షంలో వీలైనంత తొందరగా ఎన్నికలు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో భాజపా ఓటమి ప్రభావం తగ్గక ముందే ఎన్నికలకు వెళితే జెడియుకు బాగా కలిసి వస్తుందని నితీష్ వ్యూహంగా మారవచ్చు. జెడియు వ్యూహాన్ని భాజపా చాణిక్యుడు అమిత్ షా ఎలా ఛేదించబోతున్నారో చూడాలి.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jdu  nithesh kumar  cm manghee  bihar politics  bihar updates  

Other Articles