దండం దశగుణం భవేత్ అని పెద్దలు ఊరికే అనలేదు. విద్యార్థులకు కొంచెం ఇబ్బందిపడినా.. భయపడినా.. పర్వాలేదు కానీ గురువులంటే భయభక్తులు లేకుంటే విద్యా రాదన్నది పెద్దల ఉవాచ. అయితే అక్కడ మాత్రం ఉపాధ్యాయులు దండం బదులుగా తుపాకులను చేతబడుతున్నారు. విద్యార్థులు చదవకపోతే.. సరిగా అభ్యసించకపోతే తుపాకులతో వారిని కాల్చడానికి మాత్రం కాదు.. మరెందుకు వారు తుపాకులను చేతబట్టుకున్నారు. ఉపాధ్యాయులకు సైన్యం తుపాకీ పేల్చడంలో శిక్షణను ఎందుకు ఇస్తుంది. ఇంతకీ ఇదంతా జరుగుతుంది ఎక్కడ..?
పాకిస్థాన్ లో టీచర్లు తుపాకులు పట్టారు. తమను తాము కాపాడుకోవడంతో పాటు విద్యార్థులనూ రక్షించేందుకు తుపాకులను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఉగ్రమూకల దాడులను కాచుకునేందుకు ఆయుధాలు ధరించారు. పెషావర్ సైనిక పాఠశాలలో ఉగ్రవాదులు సాగించిన రాక్షస క్రీడలో 140 మందిపైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్ లోని స్కూల్స్ కు భద్రత కట్టుదిట్టం చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీచర్లకు తుపాకులిచ్చారు. అంతేకాదు వాటిని ఎలా వాడాలో కూడా శిక్షణనిచ్చారు.
ఫ్రంటీరియల్ కాలేజీలో 8 మంది మహిళా ఉపాధ్యాయులు ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి, మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పిస్టోలు, ఏకే-47 తుపాకులు ఎలా పేల్చాలో ఇందులో నేర్పించారు. భద్రతా చర్యల్లో భాగంగా పాఠశాలల్లో సీసీ కెమెరాలు, ముళ్లకంచె పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అయితే టీచర్ల తుపాకులు ఇవ్వడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది గన్ కల్చర్ కు దారితీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more