Cash on delivery train tickets at doorsteps

IRCTC, cash on delivery, train tickets, cash on delivery train tickets, Anduril Technologies, BookMyTrain.com, train tickets at doorsteps, pilot project,

IRCTC has now launched cash on delivery train tickets at your doorsteps, targeting customers who refuse to share their credit and debit card details.

డోర్ డెలివరీలో రైల్వే టిక్కెట్లు.. అప్పుడే చెల్లింపులు..

Posted: 02/03/2015 11:44 AM IST
Cash on delivery train tickets at doorsteps

రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇక రైల్వే టిక్కెట్లు కూడా డోర్ డెలివరీ చేయబడతున్నాయ్. అదేంటని విస్తుపోకండి.. ఇది నిజమే. రైల్వే టిక్కట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారి ఇంటికి టిక్కెట్లు బట్వడా చేయబడతాయి. అంతేకాందండీ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా లేకుండానే టిక్కెట్లు ఇంటి వద్దకు డోర్ డెలివరీ చేయబడతాయి. అయితే టిక్కెట్లు ఇంటికి చేరిన సమయంలో చెల్లింపులు చేయాల్సి వుంటుంది. ఈ సరికొత్త విధానానికి భారతీయ రైల్వే తెరతీసింది.

ఆన్ లైన్ లో వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను సొందుపర్చడంలో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఈ నూతన విధానాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ లేని కస్టమర్లను కూడా భారతీయ రైల్వే.తమ టిక్కెట్లను బుక్ చేసుకునే వెసలు బాటును కల్పిస్తుంది. రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో సరిపడా డబ్బు లేకపోయినా.. ఇక దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంటి ముంగిళ్లలోకి టిక్కెట్లు చేరుకుంటాయి. అయితే టిక్కెట్లు చేరిన సమయంలో చెల్లింపులు చేయాల్సి వుంటుంది.

ఈ పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా దేశంలోని 200 ప్రధాన నగరాల్లో చేపట్టామని, ఆయా నగరాలలోనే ప్రస్తుతం సర్వీసులు అందజేస్తున్నామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకంలో టిక్కెట్లు పొందాలనుకునే వినియోగదారులు కనీసం ఐదు రోజుల ముందుగానే బుక్ చేయాలని అధికారులు తెలిపారు. అయితే డోర్ డెలివరీలో టిక్కెట్లు పొందేవారు స్లీపర్ టిక్కెట్ పై కనీసం 40 రూపాయలను అదనంగా చెల్లించాల్సి వుంటుందన్నారు. అదే ఏసీ టిక్కెట్లపైన అయితే ఆదనంగా 60 రూపాయలను చెల్లించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు. ఈ పథకం విజయవంతం అయితే ఇక టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీయాల్సిన అవసరం వుండదని భావిస్తున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railways  cash on delivery  train booking.  

Other Articles