Ap decides to conduct eamcet separately

AP to conduct eamcet separately, ap cabinet meet, Ap minister Ganta srinivasa Rao, ap chief minister chandrababu, Telangana government, Telangana secretary rajiv trivedi, telangana cm KCR, KCR, rajeev trivedi, kakinada jntu, kadiyam srihari, jagadishwar reddy, Andhra Pradesh, Telangana, Eamcet, Common Entrance Test, central government

AP government decided to conduct its own Eamcet. Other common entrance test (Cets) for admission to various professional courses will also be conducted separately along the lines of Telangana.

వీడిన పీటముడి, ఎట్టకేలకు ‘ఎం సెట్’ చేశారు

Posted: 02/03/2015 08:48 AM IST
Ap decides to conduct eamcet separately

ఎంసెట్ ప్రవేశ పరీక్ష్ల నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన పీటముడి ఎట్టకేలకు విడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలు ఆయా రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేకంగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల బాధ్యతలను కాకినాడ జేఎన్ టీయుకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నిర్ణయించింది. కాగా తెలంగాణలో హైదరాబాద్ జేఎన్ టీయూ ఈ పరీక్షలను యధావిధిగా నిర్వహించనుంది.

విభజన చట్టంలోని పదో షెడ్యూలులో ఉన్న విద్యా సంస్థలన్నీ పదేళ్ల పాటు ఉమ్మడిగా ఉండాలన్న నిబంధనను తోసిరాజిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ ప్రవేశ పరీక్షఃల విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఈ విషయంలో కేంద్రానికి పిర్యాదు చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఉమ్మడి ఎంసెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ముందుగానే చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేసినందున ఈ విషయమై కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీకి తెలంగాణ సర్కారు నిర్నయంపై పిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. తెలంగాణ తీరుపై కోర్టుకు వెళ్లడం వల్ల పరీక్షలు ఆలస్యమై విద్యార్థులకు నష్టం వస్తుందని, కనుక కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు.
 
షెడ్యూల్‌లో మార్పులు లేకుండానే ప్రవేశ పరీక్షలు...
 
ఎంసెట్‌ను వేరుగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ అంశాన్ని ఏపీ ఉన్నత విద్యామండలి ద్వారా అధికారిక ప్రకటన చేయించనుంది. సీఎంతో సమావేశానంతరం మంత్రి గంటా ఉన్నత విద్యాశాఖాధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డిలతో మాట్లాడారు. విశాఖపట్నంలో ఇవాళ మరోసారి సమావేశం నిర్వహించి ఎంసెట్‌తో సహా వివిధ ప్రవేశ పరీక్షలపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి వివిధ సెట్లకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారమే సెట్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. ప్రభుత్వాలు నిర్వహించే సెట్ల తేదీలన్నిటినీ సరిచూసుకున్నాకనే షెడ్యూల్‌ను రూపొందించినట్లు వివరించారు.
 
కాకినాడ  జేఎన్‌టీయూకు ఎంసెట్ పరీక్షల బాధ్యత...
 
ఎంసెట్ బాధ్యతను కాకినాడ జేఎన్ టీయూకు అప్పగించాలని ఆంధ్రప్రధశ్ ప్రభుత్వం భావిస్తుస్తోంది. కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహిస్తున్న ఈసెట్‌ను వేరే వర్సిటీకి అప్పగించనున్నారు. ఎడ్‌సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తున్నందున దానికే ఆ బాధ్యతలను కొనసాగించవచ్చని చెప్తున్నారు. లాసెట్‌ను శ్రీవెంకటేశ్వర వర్సిటీ, పీఈసెట్‌ను నాగార్జున వర్సిటీ నిర్వహిస్తున్నందున వాటికే ఆయా సెట్‌ల బాధ్యత కొనసాగించనున్నారని తెలుస్తోంది. ఐసెట్‌ను, పీజీఈసెట్‌ను ఏపీలోని వేరే యూనివర్సిటీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఐసెట్‌ను ఏయూకి కేటాయించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహించేది. కాగా ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ బాధ్యతలను నిర్వహించనుంది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  telangana  EAMCET  chandra babu  Ganta srinivasa rao  cet  

Other Articles