Bollywood actor summoned by mumbai police

Bollywood Actor summoned by Mumbai police, Actor Arjun Rampal summoned by Mumbai police, mumbai police summons Arjun ramphal, Arjun ramphal meets gangster Arun Gawli, Arjun ramphal meets gangster, Arjun ramphal meets Arun Gawli, Arjun ramphal meets gawli without permission, Arjun ramphal movies, Arjun ramphal hits, arjun ramphal photos, arjun ramphal latest news

Bollywood Actor Arjun Rampal summoned by Mumbai police for meeting jailed gangster Arun Gawli in january

బాలీవుడ్ నటుడికి ముంబై పోలీసుల సమన్లు

Posted: 02/03/2015 12:20 PM IST
Bollywood actor summoned by mumbai police

ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రాంపాల్ కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. గ్యాంగ్ స్టర్ అరుణ్ గౌలిని కలసి సుమారు గంట పాటు వారిద్దరూ చర్చించారన్న అంశంపై నటుడు అర్జున్ రాంపాల్ ను పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు జేజే మార్గ్ పోలిసులు తమకు అందిన సమాచారాన్ని నిర్ధారించుకున్న తరువాత సమన్లు జారీ చేశారు. పోలీసులు అదుపులో వున్న ఆయనను తమ అనుమతి లేకుండా కలసి, గంట పాటు చర్చించడంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో కూపీ లాగిన పోలీసులకు అది నిజమని తెలియడంతో వారు అర్జున్ రాంపాల్ కు సమన్లు జారీ చేశారు.

2008లొ జరిగిన ముంబై కార్పోరేటర్ కమ్లాకర్ జంషాండేకర్ హత్యకేసులో దోషిగా తేలిన అరుణ్ గౌలికి న్యాయస్థానం జీవితకాల కారాగారశిక్షను విధించింది. అయితే శిక్ష అనుభవిస్తున్న గౌలిని సాధరణ ఆరోగ్య పరీక్షలలో భాగంగా జేజే అసుపత్రికి తరలించగా అక్కడ ఆయనతో అర్జున్ రాంపాల్ బేటీ అయ్యారు. సుమారు గంట పాటు వీరిద్దరు చర్చలు జరిపారు. వీరిద్దరి చర్చల సారాంశంమేమిటన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు. దీంతో నటుడు రాంపాల్ కు సమన్లు జారీ చేసి.. విచారించాలని నిర్ణయించారు.

 అయితే తమ అధినంలో వున్న ఖైదీని అనుమతి లేకుండా ఎలా కలిసారన్న విషయమై రాంపాల్ కు ముంబై పోలీసులు సమన్ల పంపారు. డాడీ సినిమాలో అర్జున్ రాంపాల్ గ్యాంగ్ స్టర్ అరుణ్ గౌలి పాత్రను ఫోషించారు. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కోర్టు అనుమతి లేకపోవడంతో గాలితో భేటీ రాంపాల్‌కు కష్టాలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. తాలోజా జైలు నుంచి ఆస్పత్రికి గాలిని తీసుకుని వచ్చిన పోలీసులపై అంతర్గత విచారణ కూడా జరుగుతోంది. గాలితో భేటీపై రాంపాల్‌ను పోలీసులు ప్రశ్నిస్తారని ఆయన చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arjun rampal  arun gawli  mumbai police  arjun rampal summoned  

Other Articles