New secretariat with 8 blocks

new secretariat with 8 blocks, proposal for new telangana secretariat, 9 floors building for chief minister, new multilevel parking building, ministers blocks with 6 to 8 floors, two floors proposed for ministers, Roads and buildings, new telangana secretariat, secretariat proposed at erragadda, Telangana government, Telangana secretary rajiv trivedi, telangana cm KCR, KCR, rajeev trivedi

telangana government nods for proposal of new secretariat with 8 blocks

ఏడున్కోక్క బ్లాకులు, తొమ్మిది అంతస్థులతో సచివాలయం

Posted: 02/03/2015 07:59 AM IST
New secretariat with 8 blocks

రాష్ట్ర రాజధాని లేక నూతనంగా రాజధాని నిర్మాణం చేపట్టి.. అధునాతన మౌళిక వసతులతో సచివాలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సన్నధం అవుతున్న క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం కూడా నూతన సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఎర్రగడ్డలో నిర్మించనున్న నూతన సచివాలయాన్ని ఎనిమిది బ్లాకులుగా చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అందులో ముఖ్యమంత్రి పేషీ కోసం ఏడు నుంచి తొమ్మిది అంతస్తుల వరకు ఉండే ఒక బ్లాకును, ఇతర మంత్రిత్వ శాఖల కోసం ఆరు బ్లాకులు, పార్కింగ్ కోసం ఒక మల్టీలెవల్ పార్కింగ్ బ్లాకును నిర్మించాలని భావిస్తున్నారు. నూతన సచివాలయం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ త్రివేది ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.

మొత్తం ఎనిమిది బ్లాకులుగా నూతన సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కోసం ఏడు నుంచి తొమ్మిది అంతస్తులుండే ప్రత్యేక బ్లాక్ ఉంటుంది. ఇందులోనే దిగువన ప్రజా సంబంధాల విభాగం ఉండనుండగా.. దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయనకు సంబంధించిన ఇతర విభాగాల కార్యాలయాలు ఉంటాయి. వీటితోపాటు మూడొందల మంది కూర్చునే సామర్థ్యంతో ప్రత్యేక సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్, మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక హాల్‌లు ఉంటాయి.

ముఖ్యమైన అతిథులతో భేటీ అయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. వీటన్నింటినీ పూర్తి అధునాతన  వసతులతో ఏర్పాటు చేయనున్నారు. ఇక మంత్రుల కోసం ఆరు బ్లాకులను విడివిడిగా నిర్మించనున్నారు. ఇవి ఒక్కొక్కటి 6 నుంచి 8 అంతస్తులతో ఉంటాయి. ఈ బ్లాకుల్లో ఒక్కో మంత్రిత్వ శాఖకు రెండు అంతస్తుల చొప్పున కేటాయిస్తారు. వాటిల్లో మంత్రి, ఆ శాఖ కార్యదర్శి, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను అనుసరించి అంతస్తుల సంఖ్యను పెంచుతారు.
 
ప్రస్తుత సచివాలయంలో పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు లేవు. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు. ఒక్కోసారి లోపల స్థలం సరిపోక సచివాలయం వెలుపల రోడ్డుపక్కన కూడా వాహనాలను నిలుపుతున్నారు. ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా నూతన సచివాలయంలో ప్రత్యేకంగా మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ర్యాంపుల మీదుగా వాహనాలు పైఅంతస్తుల్లోకి చేరుకుంటాయి. దీనిని ఏడెనిమిది అంతస్తులతో నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new secretariat  8 blocks  telangana  Erragadda  

Other Articles