Kiran bedi cm canditate or mla candidate

Kiran Bedi, Bharatiya Janata Party, Kiran Bedi joins BJP, Shazia Ilmi, Jaya Prada, BJP National President Amit Shah, Delhi, Delhi Elections, Delhi Assembly Elections 2015, kiran bedi cm candidate, aravind kejriwal, anna hazare, anti corruption cruseder, Arun jaitley

Former IPS officer Kiran Bedi joined Bharatiya Janata Party in the presence of National President Amit Shah and Union Ministers Arun Jaitley and Dr Harsha Vardhan.

బీజేపీలోకి కిరణ్ బేడి. సీఎం అభ్యర్థిగానా..? లేక ఎమ్మెల్యేగానేనా..?

Posted: 01/15/2015 09:46 PM IST
Kiran bedi cm canditate or mla candidate

ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్‌బేడి ఢిల్లీలో బీజేపిలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అమిత్‌షా, అరుణ్‌జైట్లీల సమక్షంలో కిరణ్‌బేడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్‌బేదికి పార్టీలో సాదర స్వాగతం పలుకుతున్నానని, ఆమె చేరికవల్ల ఢిల్లీలో బీజేపి బలం మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా అమిత్‌షా అన్నారు. న్యూఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీ సీఎం ఎవరనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ బేడీ మాట్లాడుతూ... మోదీ పాలన తనలో స్పూర్తి నింపిదని ఆమె తెలిపారు. తానేప్పుడు పదవుల కోసం పని చేయడం లేదని ... తన జీవితం దేశానికే అంకితమని ఆమె స్పష్టం చేశారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా తన 40 ఏళ్ల అనుభవాన్ని ఢిల్లీ ప్రజలకు అర్పించేందుకే వచ్చానని కిరణ్బేడీ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో తమ సత్తాను చాటేందుకు.. ముఖ్యమంత్ర అభ్యర్థిగా ఎవరి పేరును ప్రతిపాదించాలన్న నేపథ్యంలో గత కొన్నాళ్లుగా తర్జనభర్ఝన పడుతూ వస్తున్న బీజేపికి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హాజారే శిష్యురాలిగా, ఐపీఎస్ మాజీ అధికారినిగా ఖ్యాతి సంపాదించిన కిరణ్ బేడీ రాక ఢిల్లీ పార్టీ రాజకీయాల్లో మార్పులకు అజ్యం పోసింది. విధి నిర్వహణలో నితీ నిజాయితీలకు కట్టుబడి, సిన్సియారిటీకి మారుపేరుగా పేరుగాంచిన అమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీకి కలసిరావడంతో పాటు.. అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి చెక్ పెట్టడంతో పాటు అప్ కార్యకర్తలను తమ వైపు తిప్పుకోడానికి కూడా ఆస్కారముంటుందని బీజేపి వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అదీ కాక చట్టాలపై పూర్తి అవగాహన వున్న కిరణ్ బేడి.. ఢిల్లీకి ముఖ్యమంత్రి అయితే.. అక్కడి వున్న మహిళల ఓట్లను కూడా పోందవచ్చని, మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నిలువరించడంలోనూ అమె అనుభవం దోహదపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

కాగా కిరణ్ బేడీ రాజకీయాల్లోకి వచ్చినందుకు ఆనందంగా ఉందని ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కిరణ్ బేడీ రాజకీయ ఆరంగ్రేటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కిరణ్ బేడీ రాజకీయాల్లోకి రావడం ఆనందంగా వుందన్నారు. రాజకీయాల్లోకి రావాలని తాను అనేక పర్యాయాలు కిరణ్ బేడీని కోరినట్లు, పలు పర్యాయాలు ఆహ్వానాలు కూడా పలికానని చెప్పుకోచ్చారు. అప్పట్లో తన విజ్ఞప్తిని కిరణ్ బేడీ సున్నితంగా తిరస్కరించారని, ఎట్టకేలకు ఆమె రాజకీయాలో్లకి రావడం శుభపరిణామమని చెప్పుకోచ్చారు. కిరణ్ బేడీ అంటే తనకు అపార గౌరవమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran Bedi  Bharatiya Janata Party  Amit Shah  Arun jaitley  

Other Articles