Balakrishna nimmakuri sankranti festival cock fight

balakrishna latest news, balakrishna news, balakrishna sankranti festival, balakrishna cock fight, balakrishna nimmakuru, nimmakuru village news, balakrishna family members

balakrishna nimmakuri sankranti festival cock fight : balakrishna celebrated sankranti festival in his hometown along with his family members. he is also take part in cock fight.

ITEMVIDEOS: ఎడ్లబండి.. కోడిపందెం.. ఇదీ బాలయ్య పండగ సంబరం!

Posted: 01/15/2015 08:24 PM IST
Balakrishna nimmakuri sankranti festival cock fight

సంక్రాంతి పండుగ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులందరూ తమతమ పుట్టిళ్లలో జోరుగా సంబరాలు జరుపుకున్నారు. ఇక నందమూరి నటవారసుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తన పుట్టిల్లు అయిన నిమ్మకూరు సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. తమ ప్రియతమ నటుడు గ్రామానికి రావడంతో ఒక్కసారి అక్కడున్న ప్రజల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. స్థానికులందరూ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, బ్రహ్మరథం పట్టారు.

బుధవారంరోజు కుటుంబసభ్యులతో తన పుట్టిల్లు నిమ్మకూరు గ్రామానికి చేరుకున్న బాలయ్య.. తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. మొదట తన గ్రామానికి ఎడ్లబండిపై వచ్చిన బాలయ్యను చూసి అక్కడి స్థానికులు పూలమాలలతో ముంచెత్తి, ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎడ్లబండిపై నుంచి దిగిన ఆయన.. పందేనికి సిద్ధంగా వున్న కోడిపుంజులను తన చేతుల్లోకి తీసుకుని వాటి మేను తడిమారు. అనంతరం కోడిపందేల భాగంగా అక్కడే కొద్దిసేపు వరకు వుండి తిలకించారు. బాలయ్య ఇలా ప్రత్యక్షమై తమ కోడిపుంజులను చేతబట్టడంతోపాటు అక్కడే కొద్దిసేపు వుండటంతో అక్కడున్న జనాలలో ఉత్సాహం కట్టలు తెంచుకున్నట్టయ్యింది. ఒక్కసారిగా అందరూ బాలయ్య నినాదాలతో హోరెత్తించేశారంతే!

అనంతరం కొద్దిసేపు ప్రసంగించిన బాలయ్య.. అక్కడి నుంచి కదిలి ముందుకెళ్లిపోయారు. అనంతరం గ్రామప్రజలతో కలిసి కొద్దిసేపటివరకు మమేకమయ్యారు. ఇక కుటుంబసభ్యులతో ఆయన పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇదిలావుండగా.. పండుగ రోజు తమ ప్రియతమ నటుడు రావడంతో ఆ గ్రామప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna sankranti festival  balayya cock fights  

Other Articles