Trinamool minister manjul krishna thakur resigns joins bjp in bengal

Trinamool minister manjul krishna thakur resigns, manjul krishna thakur resigns to party, manjul krishna thakur resigns to ministry, manjul krishna thakur resigns for his son, big blow Trinamool government, big blow to mamatha, manjul krishna thakur joins BJP, manjul krishna thakur, kapil krishna thakur, subrata thakur, bongaon parliamentary constituency,

trinamool minister manjul krishna thakur resigns joins bjp in bengal

దీదీకి షాక్, కేంద్రంపై రుసరుసలు

Posted: 01/15/2015 09:51 PM IST
Trinamool minister manjul krishna thakur resigns joins bjp in bengal

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే వరుసగా షాక్లతో అటుపోట్లకు గురవుతున్న మమత గూటి నుంచి మరో పక్షి ఎగిరిపోయింది. శారదా స్కామ్లో ఆమె కేబినెట్లోని రవాణాశాఖ మంత్రి మదన్ మిత్ర జైలుకు వెళ్లారు. అలాగే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఇదే సమయంలో మమత బెనర్జీ క్యాబినెట్ మంత్రి పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పారు. మమతా కేబినెట్లోని మంజులా కృష్ణ థాకూర్ తన మంత్రి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వెనువెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తృణమూల్ పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. పార్టీలో మంచి వారికి చోటు లేదని థాకూర్ విమర్శించారు.

అదే సమయంలో మమతాబెనర్జీ మరోసారి కేంద్రంపై విమర్శలకు దిగారు. కేంద్రం ప్రాంతీయ పార్టీలను విస్మరించకూడదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ రాష్ట్రాలతో సఖ్యత ప్రదర్శించాలని సూచించారు. ప్రాంతీయ పార్టీలపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తూ.. తమ పార్టీని బలోపేతం చేసుకోవడం కూడా సహేతుకం కాదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరోకటిగా వుందని, దీనిని ప్రజలు గమనించాలని మమతా బెనర్జీ సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manjul Krishna Thakur  Trinamool minister  resigns  

Other Articles