Maoists kidnapped 13 tribal people

Maoists kidnap, Maoists kidnapped tribals, Maoists kidnapped 13 tribals, kidnapped scene came into light, Maoists kidnapped tribals from East godavari district, maoists kidnapped tribals from chinturu mandal, maoists kidnapped tribals from chattisgarh boarder, maoists kidnapped tribals from pega village

Maoists kidnapped 13 tribal people in Andhra pradesh, on saturday

‘అన్న’ల చెరలో 13 మంది అడవి బిడ్డలు..

Posted: 12/30/2014 09:47 PM IST
Maoists kidnapped 13 tribal people

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు తమ ప్రబాల్యాన్ని పుంజుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానాలు వచ్చేలా వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం అంతగా లేదని ప్రభుత్వ చెబుతుండగానే.. మావోలు అలజడి సృష్టిస్తున్నారు. ఛత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దులోని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోకి చోచ్చుకువచ్చిన మావోలు.. 13 మంది గిరిజనులను అపహరించుకుపోయారు. గత శనివారం రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి.

చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దులోని తూర్పు గోదావరి జిల్లా నుంచి 13 మంది గిరిజనులను మావోయిస్టులు అపహరించుకు పోయారు. జిల్లాలోని చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన 13 మంది అడవి బిడ్డలను అపహరించుకుపోయారు. అయితే వారిని ఎందుకు తీసుకెళ్లారు..? ఎక్కడికి తీసుకెళ్లారన్న విషయాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మావోలు తమ వారిని అపహరించుకుపోయారని స్థానిక పోలిస్ స్టేషన్ లో పిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అడవి బిడ్డల అపహరణపై మీడియాలో కథనాలు వెలువడటంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను అదేశించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  Andhrapradesh  kidnap  tribals  

Other Articles