Dense fog hits air train traffic in delhi cold wave continues

Dense fog hits delhi and northern states, cold wave continues delhi and northern states, Dense fog hits air, train traffic, 27 flights delayed in delhi due to fog, 90 trains running late in delhi, 9 trains cancelled in delhi,

A massive blanket of fog settled over the national capital this morning, severely disrupting air and rail traffic with 27 flights delayed and nearly 90 trains running late.

చిగురుటాకులా వణుకుతున్న ఉత్తరాధి రాష్ట్రాలు..

Posted: 12/30/2014 09:44 PM IST
Dense fog hits air train traffic in delhi cold wave continues

ఉత్తరాదిని చలి పులి వణికిస్తోంది. శీతలం ధాటికి ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. కాగా చలి తీవ్రతను తట్టుకోలేక ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 16మంది మృతి చెందారు. అన్ని ఉత్తరాధి రాష్ట్రాల్లోనూ చలి పులి పంజా విసరడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంక మేర్పడింది. దిల్లీలో పొగమంచు కారణంగా 14 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 88 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

దేశ రాజధానిలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో ఢిల్లీ నుంచి రాకపోకలు జరపాల్సిన 96 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్టు ఉత్తర రైల్వే తెలియజేసింది.  బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi  northern states  air and rail traffic  

Other Articles