Crops burnt again in tullur mandal of andhrapradesh capital region

TDP government, Andhra pradesh capital villages farmers, chandrababu, AP chief minister chandrababu, andhrapradesh minister acham naidu, minister alleges act of opposition parties, minister assures inquiry commitee, achem naidu says stuburn action, inquiry into crops burnt,

crops burnt again in tullur mandal of Andhrapradesh capital region even after government assures inquiry

మళ్లీ రాజుకున్న మంటలు.. కమిటీ వేశామన్న పాలక పక్షం

Posted: 12/29/2014 10:18 PM IST
Crops burnt again in tullur mandal of andhrapradesh capital region

నవ్యాంధ్ర రాజధాని తూళ్లూరు పరిసర ప్రాంతాల్లో దుండగుల అలజడి పై రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని తూళ్లూరు పరిసర ప్రాంతాల్లోనే నిర్మించనున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నాటి అక్కడి రైతాంగం ఆందోళన చెందుతున్నారు. అయితే తమకు లభించే పారితోషకం, నష్టపరిహారం తదితర అంశాలపై బెట్టు వీడని రైతులు.. తమ భూములను ఇచ్చేందుకు సుముఖంగా లేమని ప్రభుత్వానికి తెగేసి చెప్పిన సందర్భంలో వారిని కొత్త సమస్య ఇబ్బందిపెడుతోంది. కొందరు గుర్తు తెలియని దుండగులు వారి పంట పోలాలను ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడంలాంటి చర్యలకు పూనుకుంటున్నారు. వారిని పట్టుకునే లోపు పారిపోతున్నారని రైతులు అరోపిస్తున్నారు.

దీనిపై ప్రభుత్వం స్పందించి అగ్ని ప్రమాదాలపై విచారణ కమిటీని వేశామని తెలిపింది. కమిటీ నివేదిక వచ్చాక రాజధాని పరిసర ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫాక్షన్ రాజకీయాల కోసమే జగన్ కుయుక్తులు  పన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు. నాలుగు కోట్ల మందికి ఇష్టమైన రాజధాని జగన్ కు ఇష్టంలేదన్నారు. మంత్రివర్యులు కమిటీని వేశామన్న తరువాత కూడా తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో మళ్లీ అగ్గి రాజుకుంది. స్థానికంగా వున్న పోలాల్లో దుండగులు నిప్పు పెట్టారు. దీంతో దుండగులు ఎవరైనా ఉన్నారేమోనని, పొలాల్లో దాక్కున్నారేమోనని రైతులు వెతుకుతున్నారు. రాయపూడికి చెందిన రైతులు కూడా అక్కడకు చేరుకున్నారు.

తమ ప్రాంతంలో మళ్లీ మంటలు వస్తాయేమోనన్న ఆందోళనలో రైతులు కనిపిస్తుంది. పొద్దున్న సంఘటన జరిగి.. దానిపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా, మళ్లీ సాయంత్రం మంటలు చెలరేగాయి. రాజధాని కోసం గజం భూమి కూడా ఇవ్వబోమని చెప్పిన ప్రాంతంలోనే ఈ తరహా దాష్టీకాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని తమ పోలాలను, పంటలను కాపాడాలని రైతాంగం కోరుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  andhrapradesh capital villages farmers  acham naidu  

Other Articles