Warangal will be developed on par with hyderabad says cm kcr

warangal on par with hyderabad, warangal developement on par with hyderabad, warangal alternative capital city, Telangana chief minister KCR, Telangan assures warangal alternative capital city, IT companies will be located in warangal, universities will be located in warangal,, services sector industries will be located in warangal,

warangal will be developed on par with hyderabad, 150 ft roads, IT companies, universities, services sector industries will come to warangal says cm kcr

వరంగల్ ను హైదరాబాద్ కన్నా మిన్నగా అభివృద్ది చేస్తాం

Posted: 12/29/2014 06:35 PM IST
Warangal will be developed on par with hyderabad says cm kcr

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అమోదిత ముద్రలో స్థానాన్ని కల్పించడమే కాదు.ఆచరణలోనూ వరంగల్ ను అన్ని విధాలా అభివృద్ది చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటీ కంపెనీలు అన్నీ వరంగల్ జిల్లాకే వస్తాయని ఆయన చెప్పారు. వరంగల్ ప్రధాన రహదారులను 150 అడుగుల మేరకు విస్తరిస్తామన్నారు. వరంగల్ జిల్లా సమీక్షలో ఆయనీ వివరాలు వెల్లడించారు. కాకతీయుల హాయంలో వెలుగులు విసిరిన ఈ నగరంలో వారిని మించిన అభివృద్దితో ముందుకు సాగేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందన్నారు.

కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వీటికి ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న కాకతీయుల వారసులను కూడా ఆహ్వానిస్తామని కేసీఆర్ చెప్పారు. మైసూరు దసరా ఉత్సవాల తరహాలో కాకతీయ ఉత్సవాలు ఉంటాయన్నారు. పార్లమెంటులో ఝాన్సీ లక్ష్మీబాయి ఫొటో ఉన్నట్లే.. రాణి రుద్రమదేవి ఫొటో పెట్టాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. మిషన్ కాకతీయ ప్రారంభానికి సూచికగా హన్మకొండ వడ్డేపల్లి చెరువు వద్ద పైలాన్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. మామూనూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana cm kcr  warangal  alternative capital  

Other Articles