Assam carnage 72 dead in bodo militant attacks

Assam carnage, 72 dead in Bodo militant attacks, Bodo militant killing spree, adivasis, bofo militants demanding a separate homeland, militants demand indigenous Bodo tribesmen, Protesters demonste against killing, Protesters fired by police, Assam carnage protest,

Protesters demonstrating against the killing were fired upon by the police this morning. 70 people have been killed since Tuesday evening.

24 గంటలు.. 70 మంది మృతులు.. సంఖ్య పెరగడానికి కారణమేంటి..?

Posted: 12/24/2014 09:41 PM IST
Assam carnage 72 dead in bodo militant attacks

అసోంలోని సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాలో ఉగ్రవాదుల జరిపిన మారణహోమంలో మృతుల సంఖ్య ఇవాళ సాయంత్రానికి 70కి పెరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. అసోంలో ఉగ్రవాదుల దాడిని అన్ని రాజకీయ, సామాజిక పక్షాలు ఖండించాయి. అసోంలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అసోంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటిచింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అసోంలో పర్యటించారు.  బోడో తీవ్రవాదు నరమేధానికి పాల్పడిన ప్రాంతాలను రాజ్నాథ్ తన శాఖకు చెందిన సహాయ మంత్రి కిరెన్ రిజిజ్జుతో కలసి సందర్శిస్తామన్నారు. అసోం మృతుల వారు అంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం వహించారు.

సోంత రాష్ట్రం కోసం గత దశాబ్దకాలంగా బోడో తీవ్రవాదులు పోరాటం చేస్తున్నారు. అయితే వారి ఏరివేతకు సైనిక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బోడో తీవ్రవాదులు చాలా నష్టపోయారు. ఇటీవల సైనికుల ఎదుర కాల్పుల్లో ఇద్దరు బోడో తీవ్రవాదులు మరణించారు. దాంతో తీవ్రవాదల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సైనికులకు గిరిజనులు సహకరిస్తున్నారని అనుమానించిన తీవ్రవాదులు ఆదివారం రాత్రి సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో 72 మంది మరణించారు. కేవలం 24 గంటలు అయితే ఇంత మంది ఎలా చనిపోయారు. ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో మృతులు కొంత మందే అయితే మిగిలిని వారు ఎలా చనిపోయారన్నదే ప్రశ్నగా మారింది.

ఉగ్రవాదులు దుశ్చర్యపై వార్తలు వెలువడగానే ప్రతీకారేఛ్చతో రగిలిపోయిన ఆదివాసీలు.. చేతులతో ఆయుధాలతో బోడో గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ దాడులను అడ్డుకునేందుకు అప్పటికే పెద్ద సంఖ్యలో పహారా వున్న పోలీసులు వలయాలను దాటుకుని వెళ్లేందుకు యత్నించారు. దీంతో తమ వారిని పోగోట్టుకుని తీవ్ర ఆవేదనలో వున్న ఆదీవాసీలుకు బోడో ఉగ్రవాదులపై కన్నెర్ర చేశారు. దాడులకు యత్నించగా, వారిని పోలీసు తూటాలు కబళించాయి. దాడులు చేయవద్దని పోలీసుల హెచ్చరికలను మీరిన ఐదుగురిని పోలీసులు కాల్చిచంపారు.

బోడా ప్రాంతంతో పాటు సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాలో విధించిన కర్ఫ్యూను కాదని ఆందోళనకారులు ప్రతిదాడులకు యత్నించారు. ఇరువర్గాల దాడులతో భీభత్సమయంగా మారిన ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడుందకు పోలీసులు తీసుకున్న చర్యలు పలువురు ఆందోళనకారులను బలితీసుకోగా, మరికోందర్ని క్షతగాత్రులను చేశాయి. పోలీసుల వద్దని వారిస్తున్న అదీవాసీ ఆందోళనకారులు దుకాణాలకు నిప్పుపెట్టారు. రోడ్డు, రైలు మార్గాలను అడ్డుకున్నారు. వారిని చెదరగోట్టేందుకు చేసిన చర్యలు ఫలించకపోవడంతోనే తాము కాల్పులకు పాల్పడాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఉత్తర అసోంలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించామని, పలు ప్రాంతాలలో ఆర్మీ కూడా రంగంలోకి దిగి శాంతిభద్రలను కాపాడటంలో సాయం చేస్తుందని చెప్పారు.

అసోం మారణహోమంలో 18 మంది చిన్నారులు, 21 మంది మహిళలతో పాటు అనేక మంది అసువులు బాసారు. కాగా ఇటీవలి కాలంతో ఇది చాలా క్రూరమైన ఘటనని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ అన్నారు. చిన్నారులను, పాలు తాగే పసికందులను కూడా ఉగ్రవాదులు వదిలిపెట్టలేదని ఇది వారి కర్కషత్వాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. వందల ఏళ్ల కిత్రం అసోంకు వలస వచ్చిన ఆదివాసీలతో పాటు.. ఈ ప్రాంతాలలో స్థిరపడిన ముస్లింలను లక్ష్యంగా చేసుకుని గతంలోనూ బోడో ఉగ్రవాదులు హింసకు తెగబడ్డారు. అసోం జనాభాలో పది శాతం మేర వున్న ఉగ్రవాదులు సుమారుగా ముఫై మూడు లక్షల మంది వున్నారు. వీరంతా ప్రత్యక రాష్ట్రం కావాలని డిమాండ్ తో గత కొన్నేళ్లుగా హింసా మార్గాన్ని ఎంచుకున్నారు.

బోడోలు అడుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం లభించిన నేపథ్యంలో తమ ఉనికికి ముప్పు వాటిల్లుతందన్న అందోళన ఆదివాసీలలోనూ నెలకొంది. అయితే ఆదీవాసీలు వున్న ప్రాంతాలలో అధికంగా బోడోలు నివసించడం.. ప్రత్యక రాష్ట్ర ఏర్పాటుకు ఆదివాసీలు సహకరించకపోవడం కారణంగా ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతాలలో సుమారు 10 వేల మందికి పైగా పౌరులు మరణించారంటే.. అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు. ఇప్పటికైనా ఈ సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారించాల్సిన అవసరం వుంది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులపై వుంది.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles