Husband complaints on judge

husband complaints on judge, husband complaints seeking protcetion, husband seeking protcetion from wife, husband seeks protcetion from his judge wife, husband complaints against his judge wife, husband complaints seeking protcetion to his family, husband seeks to protect his family, case registered against judge, case filed against judge in anathapur

husband lodges complaint seeking protcetion from his judge wife, her parents to his family

జడ్జీగారు..! ఇది న్యాయమేనా.. మీరే చెప్పండీ..?

Posted: 12/24/2014 09:35 PM IST
Husband complaints on judge

తన భార్య, ఆమె తల్లిదండ్రులు,  బందుమిత్రుల నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఓ భర్త పోలిస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. అయితే ఆ భర్త ఎవరో సాదాసీధా వ్యక్తి కాదు.. చట్టాన్ని అవసోసన పట్టి న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ జడ్జి. అదేంటి జడ్జిగారి భార్తకే అంత కష్టమెందుకు వచ్చిందనుకుంటున్నారా..? తన భార్య, అతని తల్లిదండ్రులు, బంధుమిత్రుల నుంచి తనకు రక్షణ కల్పించాలని న్యాయమూర్తి భర్త టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనమైంది. దీంతో న్యాయమూర్తిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

అనంతపురం నగరం సాయినగర్‌కు చెందిన కె.జితేంద్రకు హైదరాబాద్‌లోని మియాపూర్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న శ్రీదేవితో ఈ ఏడాది మార్చి 7న వివాహమైంది. వివాహమైన వారం నుంచి తన భార్యతో మనస్పర్థలు ప్రారంభమయ్యాయని, ఈ రోజు వరకు అలాగే ఉన్నాయి. ఈ గొడవలు భరించలేక అనంతపురం కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు జితేంద్ర.. కోర్టు వ్యవహారాల కోసం న్యాయవాది ఆదిశేషారెడ్డితో కలిసి కోర్టులోనే ఉన్నాడు. నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఇంటికెళ్లగా అక్కడ తన భార్య శ్రీదేవి, ఆమె నాన్న వెంకటేశ్వర్లు, అమ్మ అనురాధ, వారి మిత్రుడు శేఖర్ లు వుండటాన్ని చూసి షాక్ కు గురయ్యాడు.

వారు తనను బలవంతంగా ఇంట్లోకి ఈడ్చుకెళ్లి విపరీతంగా దుర్భాషలాడుతూ దాడి చేశారని జితేంద్ర పేర్కొన్నారు. దెబ్బలకు తాళలేక తప్పించుకుని ఇంటి నుంచి బయట పడి నేరుగా ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నానని, మెడ, ఛాతి, నుదుటి మీద దెబ్బలు తగిలాయని వివరించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జితేంద్ర తన భార్య, అత్త, మామలు దాడి చేశారం టూ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని టూటౌన్ సీఐ శుభకుమార్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman judge  husband complaint  anantapur  

Other Articles