Hyderabad software engineer approches court against facebook

facebook, case against facebook, Hyderabad software engineer pradeep kumar, software engineer pradeep kumar mabukonda, courts orders home department, court orders TS home officials, court orders telangana government, court orders TS government to protect pradeep kumar,

Hyderabad software engineer approches court against facebook

లోపాలను ఎత్తిచూపితే.. దాడులకు తెగబడుతోంది..? ‘ఫేస్‌బుక్‌'

Posted: 12/24/2014 10:38 PM IST
Hyderabad software engineer approches court against facebook

భారతీయ విద్యావంతులను, మేధావులను కోట్ల రూపాయల ప్యాకేజీ కల్పించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఫేస్ బుక్.. నాణానికి మరోవైపు.. మరో దారుణానికి కూడా ఒడిగడుతుందని స్పష్టమవుతోంది. తమ లోపాలను ఎత్తిచూపిన పాపానికి దాడులకు కూడా తెగబడుతోందని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏకంగా కోర్టునే ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌ యాజమాన్యం నుంచి తనకు రక్షణ కల్పించాలని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ మానుకొండ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. ప్రదీప్ కుమార్ కు రక్షణ కల్పించాలని హోంశాఖను రాష్ట్రోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఫేస్‌బుక్‌లోని లోపాలను ఎత్తిచూపడం, నంబర్ వన్ స్థానంలో కొనసాగేందుకు సదరు సంస్థ చేస్తున్న మోసాలను ఎత్తిచూపడం.. అతని విజ్ఞానానికి ప్రతీక. అయితే దానిని జీర్ణించుకోలేని వెబ్ సైట్ యాజమాన్యం తనపై దాడులు చేయిస్తోందని ప్రదీప్ కుమార్ కోర్టుకు తెలిపారు. కాలిఫోర్నియాలో పనిచేస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌లో డాటా సెంటర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యానని, ఆ సందర్భంగా ఫేస్‌బుక్ లోపాల గురించి వివరించానన్నారు. ఫేస్ బుక్ ఎందుకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుందో వాళ్లకు కళ్లకు కట్టినట్టు చూపడం, ఉన్నది వున్నట్లు మాట్లాడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే తన పాలిట శాపంగా మారిందన్నారు.

దీంతో తప ప్రతిష్టను దిగజార్చే పనులకు ఫేస్ బుక్ పూనుకుందన్నారు. తనకూ అల్‌ఖైయిదాకు మధ్య సంబంధాలు ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో ప్రచారం చేసిందని ఆరోపించారు. మార్పింగ్ ఫొటోలతో పోస్టులు సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. దీంతో కాలిఫోర్నియాలో మనజాలని హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక కూడా తనపై దాడులకు తెగబడుతోందని చెప్పారు. తనపై కత్తితో హత్యాయత్నం చేసేందుకు కూడా ఫేస్ బుక్ యత్నించిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  pil  pradeep kumar manukonda  software engineer  

Other Articles