71 percent voting recorded in 2nd phase of jammu kashmir polling

jammu kashmir, 2d Phase elections, 71 percent polling, good turn out

71 percent voting recorded in 2nd phase of jammu kashmir polling

ఉగ్ర హెచ్చరికలను తోసిపుచ్చి.. భారీ పోలింగ్

Posted: 12/02/2014 09:18 PM IST
71 percent voting recorded in 2nd phase of jammu kashmir polling

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. తొలిదశలో లాగే, ఉగ్రవాదుల హెచ్చరికలను పూర్తిగా పక్కన పెట్టి.. రెండో దశలో కూడా 71 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రెండోదశ పోలింగ్ ఇవాళ ప్రారంభం అయినప్పుడు మొదట్లో కాస్త మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తరువాత పుంజుకుంది.. కానీ, కాస్త ఎండ ముదిరేకొద్దీ ఓటర్లు బారులు తీరారు. దక్షిణ కాశ్మీర్లోని దేవ్సర్, హొమేషలీబగ్, నూరాబాద్, కుల్గం నియోజకవర్గాల్లో మొదట్లో ఓటింగ్ కాస్త పల్చగానే ఉంది.

హంద్వారా పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పురుషులు, మహిళలు బారులు తీరారు. మార్పు కోసమే తాము ఓట్లు వేసినట్లు చాలామంది ఓటర్లు తెలిపారు. సైనికులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రత కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ 80 శాతం వరకు కూడా నమోదైనట్లు ఈసీ వర్గాలు చెప్పాయి. పూంఛ్, కుప్వారా లాంటి సరిహద్దు ప్రాంతాల్లో 78, 68 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి. అయితే చెదురుమదురు ఘటనల మినహా ఓటింగ్ రెండో ధశలో ప్రశాంతంగా సాగింది, ఎన్నికలను బహిష్కరించాలన్న ఉగ్రవాదుల బెదిరింపులకు జంకకుండా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్ లకు కదిలారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  2d Phase elections  71 percent polling  good turn out  

Other Articles