The things that could happen only in india

indian stupid things, indian comedy scenes, the indian happen things, indian comedy photos, comedy photos of india, stupid photos of india

The Things That Could Happen Only In India

మన దేశంలో మాత్రమే కనిపించే అరుదైన హాస్య చిత్రాలు..

Posted: 12/02/2014 08:39 PM IST
The things that could happen only in india

భారత దేశం వనరుల గని, సహజ వనురులే కాదు, మానవ వనరులకు కూడా అతిపెద్ద గని మన దేశం. సున్నాను కనుగోన్న ఆర్యబట్ట నుంచి అతితక్కువ ఖర్చుతో మంగళ్ యాన్ ను రూపొందించి అరుణ గ్రహం పైకి పంపిన ఘనత మనదే. మన కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాలు శ్లాఘిస్తున్నాయి. అయితే అతి సాధరణంగా తప్పులు దోర్లడం సహజం. కానీ తప్పులున్నా చూసుకోకుండా అలానే చేయడం ఎత్తి చూపడానికి అస్కారం కల్పిస్తోంది. 2020 నాటికి ప్రపంచ దేశాలలోనే భారత్ ఏకైన యువ దేశంగా బాసిల్లుతుందన్న ప్రధాని వ్యాఖ్యాలను మనం గుర్తు చేసుకుందాం. అందుకనే తప్పులు దోర్లకుండా చూసుకోవాలని విన్నవిస్తున్నాం. అయితే ఇలాంటి అంశాలను కాసింత హస్యాన్ని కూడా పండిస్తుండడంతో.. వాటిని మీ ముందు అవిష్కరిస్తున్నాం..

1. ఈ చిత్రం చూశారా..? ఐఎఎస్, ఐఫీఎస్ పరీక్షలకు సిద్దం చేస్తున్నట్లుగా లేదు. నర్సరీ విద్యాబోధనలో మంచి కోచింగ్ ఇస్తామంటూ బ్యానర్ పెట్టారు మనవాళ్లు. అయితే వారి బ్యానర్ లోనే అడ్మీషన్ల కోసం.. కోనసాగుతున్నాయి అని రాయడం చూస్తే వారి కోచింగ్ ఎంత పటిష్టమైనదో మనకు ఇట్టే అర్థమవుతుంది.

2. అన్ని రంగాలలో అత్యధునిక పద్దతులను అలవర్చుకుంటున్నా.. ఇప్పటికీ ఉల్లిపాయలను తరగాలంటే మాత్రం వాటి నిపుణులకు ఈ హెల్మెట్లు వాడాల్సిందేనా..

3. రెస్టారెంట్ లోపల ఎవరు లేరు. గీరాకీ లేదు. అందుకనే పాపం మవవాడు కూడా రోడ్డుపైనే విక్రయాలు ప్రారంభించాడు.

4. వెనుక వచ్చే వాహనాలు కనబడకుండా.. ఎంత చక్కగా భారీ బంపర్ స్టిక్కర్ అతికించాడో చూడండీ ఈ టాక్సీ డ్రైవర్.

5. ఇక్కడ టీ ప్రత్యేకమైనదట.. అదేంటంటే ఇక్కడి టీ ధ్రవ పదర్థ రూపంలో వుంటుందట. మరి టీని ఘన పదార్థంగా అందించేకెక్కడో..?

6. మన వారి ఇంగ్లీష్ చూసి ఆంగ్లేయులు కూడా తెల్లబోతారు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి అదృశ్యమైతే మీడియం బాడీ, గుండ్రని ముఖము, సగం చోక్కా వేసకున్నాడని ఎలా రాశారో చూడండి.

7. దోంగలు ఎత్తుకెళ్తున్నారని కాబోలు.. పాదరక్షలకు తాళం వేశాడు. అయితే మాత్రం ఎత్తుకుపోలేరా..?

8. ఎవరో తప్పులు రాస్తున్నారనుకుంటూ పర్వాలేదులే అనుకోవచ్చు. ఏకంగా ప్రముఖ అంగ్లదినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ రాసిన తప్పను చూడండి. ఫస్ట్ మాన్ ఆన్ ది మూన్ అని రాయబోయి మాన్ అని రాశారు.

9, మీరేనా.. మేమేం తక్కువ తిన్నామా అంటూ తప్పల్లో పోటికి వచ్చినట్లు వున్నారు బిగ్ బజార్ వారు. ఫ్లయింగ్ డిస్క్ అనే బదులు ఫ్లయింగ్ డిక్ అని రాశారు.

10. ఎంత మక్కువ వుంటే మాత్రం ఇలా మెర్సడిస్ బెంజ్ కారును తన టేబుల్ గా అమర్చుకుంటారు..? ఇది పలు అనుమానాలకు తావీయదు..?

11. దక్షిణపశ్చిమ రైల్వే వారి టాయ్ లెట్స్ కమ్ బాత్ రూమ్.. ఒక్క సారి అడుగుపెడితే.. రోగాలు అంటక మానవు

12. తప్పులు చేయడంలో మన ప్రభుత్వానికి సాటి ఎవరూ రారు. యూనిఫామ్ లో  స్టాంప్ సైజు ఫోటో అతికించి ఆ తరువాత దానికి అడ్డంగా పాట పాడాలట. అదే రాసివుంది. సంతకం సైన్ బదులు సింగ్ అని రాసి వదిలారు మరీ..

13. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి తనకు మరో వధువు కావాలంటూ ఇచ్చిన ఈ ప్రకటన చూడండీ. మొదటి భార్యతో వివాదాల కారణంగా తన మగతనం పోయిందని, అయితే తగు చికిత్స చేస్తే మళ్లీ వస్తుందంటూ నిజాయితీగా తన లోపాన్ని చాటుకున్నాడు. ఇది చూసి ఎవరైనా స్పందిస్తారా..? వేయి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా ప్రకటన లేదూ..?

14. ఇదో రకమైన ఫైర్ ఎక్టింగ్విషర్.. అదేనండి అగ్గి అంటుకుంటే అర్పేందుకు దీన్ని వినియోగిస్తారు. కానీ అది డ్రై ఫౌడర్ రూపంలో వుందని, స్టోర్ ప్రెషర్ టైపులో వుందని రాశారు.

15. పోయినోళ్లందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపిగురుతులు అని కవులు, గాయకులు పాటలు అలపిస్తుంటే.. ఈ వీధి గుండా బౌతిక కాయాలు వెళ్లరాదని, అంత్రియ యాత్రలు చేపట్టరాదని, అంబులెన్సులోనూ తీసుకువెళ్లరాదని బోర్డు పెట్టారు చూశారా..? మరి అనకూడదు కానీ.. ఆ వీధిలో ఎవరైనా మరణిస్తే.. ఎలా తీసుకువెళ్తారు..?

16. యూ ట్యూబ్ లో తన మిత్రడి వీడియోను చూసి ఓ మిత్రుడు స్పందించిన విధానం చూడండీ.. మనీష్ నువ్వు అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లోనే చదువుకున్నావా, ఇప్పడు లండన్ లో వుంటున్నావా..? నేను నీ ఫోటోని తప్పిపోయినట్లు ఫేస్ బుక్ చూశాను..? దీనిపై దయచేసి ప్పందించు. ఒక్క ప్రశ్నకూ సమాధానం రాకుండానే అన్ని ప్రశ్నలను అడిగేశాడు.

17. కుర్చీ వెనుక బాగం బాగుంది. కాల్లు బాగున్నాయి.. మరి దానిని ఎలా వినియోగించుకోవాలని అనుకుంటున్నారా..? ఇలా చేస్తే సరి..

18. తినబోతు రుచులెందుకు అని ఈ బుల్లి తెర సీరియల్ వాళ్లు ఎప్పడు తెలుసుకుంటారో..? ఏమో..?

19. హరీ పార్టర్ సినిమాకు.. ఆ చిత్రం పోస్టర్ తో పోల్చితే అసలు సంబంధమే లేనట్లు వుంది కదూ..

20. అబ్బో ఎంత నిజాయితీగా సెక్స్ సమస్యలకు సమాధానాలు ఇస్తున్నారో.

21. నౌకరీ డాట్ కామ్ వారి కొత్త పంథా.. ఇలాగైతే ఉద్యోగాలు వచ్చినట్లే..

22.  అబ్బో ఎంత మంచి వారో.. మగవాళ్లకు కూడా లేడిస్ హాస్టల్ పెట్టారు.

23. భలే మంచి చౌక భేరము.. ఇది విడిచినన్ మరల రాదు.. పండగ సందర్భందా 5 కేజీల అన్నపూర్ణ పిండిపై 10 పైసల తగ్గింపు...

24. నిజమే మనవారు నిజంగానే మృధుస్వాబావులే.. కాకపోతే దుస్తులు ధరంచినప్పుడే మరి అలా...

 

25. ఏ చిన్న పంక్షన్ లో చూసినా ఇలాంటి ఘటనలు సర్వసాధరణం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వుంటుంది కదా.. మన వారి డాన్సు.

26. సొగసు చూడతరమా.. ప్రత్యక్ష ప్రసారంలో కూడానా..!

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles