Ceremony to anoint shahi imam successor not legal delhi high court

Ahmed Khan, Archaeological Survey of India (ASI, )anti-Islamic, Bukhari, Constitution of India, G Rohini, Delhi high court, Jama Masjid, Narendra Mod, Syed Ahmed Bukhari, Pakistan, Shahi

Ceremony to anoint Shahi Imam successor not legal: Delhi high court

కొత్త ఇమామ్ నియామకం చట్టప్రకారం చల్లదు..

Posted: 11/21/2014 09:35 PM IST
Ceremony to anoint shahi imam successor not legal delhi high court

షాహీ ఇమామ్ పదవిని తన తరువాత తన కోడుకు కట్టబెట్టాలని మౌలనా సయ్యద్ అహ్మద్ బుఖారీ చర్యలు తీసుకోవడం చట్టబద్దం కాదని, అవి చెల్లనేరదిన ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ మేరకు బుఖారీ తలపెట్టిన దస్తర్ బందీ అనే కార్యక్రమం నిర్వహణపై స్టే విధించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు ప్రతినిధులతో పాటుగా వేడుక నిర్వహించడంపై స్టే విధించాలన్న పిటీషనర్ అభిప్రాయాలను పరిశీలించిన పిమ్మట కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.

తన తరువాత తన వారసుడిగా తన తనయుడిని జమ్మామసీదులో షాహీ ఇమామ్ గా నియమిస్తున్నారన్న ప్రతివాదుల పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టులోని జస్టిస్ జి. రోహిణీ, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వారసత్వం చెల్లదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరమేమీ లేదని అభిప్రాయపడింది. వక్ఫ్ చట్టం 1995 ప్రకారం ముఠావల్లి ( మేనేజర్ స్థాయి) అధికారి మాత్రమే నియయించే అధికారాలు వున్నాయని కోర్టు తెలిపింది. ఇమామ్ లను నియమించే అధికారాలు అయనకు లేవని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 22న జరిగే వేడుకను నిలిపివేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక వేళ మౌలనా సయ్యద్ అహ్మద్ బుఖారీ వేడుక ద్వారా తన కోడుకును కొత్త ఇమామ్ గా నియమించినా అది చట్టప్రకారం చల్లనేరదని తెలిపింది. గత కొన్ని ఏళ్లుగా జమ్మా మసీదు అవరణలోనే నివసిస్తున్న ఆయన, అయన కుటుంబసభ్యులను వేడుక చేసుకోనీయకుండా అడ్డుకోవడం తగదని ద్విసభ్య బెంచ్ అభిప్రాయపడింది. ఒక వేళ కొత్త ఇమామ్ గా తన చివరి కుమారిడినో లేక ఇతరులనో బుఖర్ ప్రకటించిన నేపథ్యంలో మరో కేసును నమోదు చేసి విచారణ జరపాల్పింది సూచించింది. షాహీ ఇమామ్ నియామకం జరగుతుందన్న నేపథ్యంలో ధాఖలైన మూడు పిటీషన్లపై కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles