Azam khans comment on taj mahal and funding on mulayam birthday celebrations draws flak

mulayam singh yadav, Samajwadi Party, birthday bash, celebrations, dawood ibrahim, talibans, Taj Mahal, Agra, Mohammed Azam Khan, Waqf board

azam khans comment on taj mahal and funding on mulayam birthday celebrations draws flak

మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి

Posted: 11/21/2014 09:33 PM IST
Azam khans comment on taj mahal and funding on mulayam birthday celebrations draws flak

సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 75వ పుట్టినరోజు వేడుకలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆ వేడుకలకు తాలిబన్ల నుంచి దావూద్ ఇబ్రహీం నుంచి నిధులు వచ్చాయని, అందుకే ఇంత ఆర్భాటంగా చేస్తున్నామని ములాయం సన్నిహితుడు, యూపీ మంత్రి ఆజంఖాన్ ఒకింత ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ములాయం.. రెండు రోజుల పాటు ఈ వేడుకలు చేసుకుంటున్నారు. 75 అడుగుల కేక్ కోస్తున్నారు. ఇంగ్లండ్ నుంచి తెప్పించిన విక్టోరియన్ గుర్రపు బండిలో ఊరేగుతారు. ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే బెలూన్లను భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా ములాయం బ్యానర్ల వద్ద కట్టారు. రోడ్డు మీద ఉండే డివైడర్లకు కూడా కొత్త రకం పెయింట్లు వేశారు.

అర్ధరాత్రి దాటగానే ములాయం 75 అడుగుల ఎత్తున్న కేకును కట్ చేస్తారు. ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో బాలీవుడ్ గాయనీ గాయకులు వస్తున్నారు. ములాయం కొడుకు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రధాన ఆకర్షణగా ఉంటారు. ఈ కార్యక్రమం అంతా సీనియర్ మంత్రి ఆజంఖాన్ సొంత ఊళ్లో జరుగుతోంది. ఆయనే ఇదంతా చేయిస్తున్నారు. ఈ ఆర్భాటాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోసలిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించిన ములాయం.. ఇప్పుడు ఇలా అట్టహాసంగా వేడుకలు చేసుకోవడం ఏంటని విపక్షాల నాయకులు మండిపడుతున్నారు. ఈ విమర్శలతో ఆజంఖాన్కు చిర్రెత్తుకొచ్చింది. డబ్బు ఎక్కడి నుంచి వస్తే ఏంటని ప్రశ్నించారు. తాలిబన్ల నుంచి దావూద్ ఇబ్రహీం నుంచి నిధులు వచ్చాయని ఆగ్రహంగా అన్నారు. కాగా అజాంఖాన్ వ్యాఖ్యాలను సమాజ్ వాదీ పార్టీ సమర్థించింది. కొందరు తమ జీవితాలలో సంతోషాలను జరుపుకోరని వ్యాఖ్యానించింది. అంతే కాదని, తాము సంబరాలను జరుపుకుంటున్నా చూస్తూ ఒర్వలేని తనం వాటికి వుందని పేర్కోంది.

అంతకు ముందు ఆయన ప్రపంచ ఏడో వింతైన తాజ్మహల్ పై చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, అప్పగించాలని వ్యాఖ్యానించారు. రోజుకు ఐదుసార్లు తాజ్మహల్ లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని అధికార సమాజ్వాది పార్టీని మరో ముస్లిం నాయకుడు కోరారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రా వాసులు, బుద్ధిజీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆజంఖాన్ కు మతి తప్పిందని బ్రజ్ మండల్ హెరిటేజ్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర శర్మ  మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంత్రికి తగదని హితవు పలికారు. మంత్రి వ్యాఖ్యలు బాధాకరమని అజ్మీర్ కు చెందిన మొఘల్ చరిత్రకారుడు ఆర్. నాథ్ అన్నారు. బీజేపీ కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను ఖండించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles