Andhrapradesh telangana chief ministers meet will resolve power and water crisis

Two Telugu states, Piyush Goyal, Harish Rao, Andhrapradesh, telangana, chief ministers, meet. resolve, power crisis, chandrababu, KCR

Andhrapradesh, telangana chief ministers meet will resolve power and water crisis

ఇలా చేస్తే.. విద్యుత్, సాగునీటి సమస్యలకు చెక్..

Posted: 11/04/2014 07:58 AM IST
Andhrapradesh telangana chief ministers meet will resolve power and water crisis

విద్యుత్‌పై తెలుగు రాష్ట్రాలు రెండూ రాజకీయాలు ఆపాలని కేంద్ర విద్యుత్  మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ముఖ్యమంత్రులిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు, కె.చంద్రశేఖర్‌రావు ఇద్దరూ కలిసి పనిచేయూలని హితవు చెప్పారు. తెలంగాణ విద్యుత్ సమస్యపై తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఎంపీలతో కూడిన బృందం గోయల్‌ను కలిసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పీయూష్ మాట్లాడుతూ తెలంగాణకు ఎంత అదనపు విద్యుత్ కావాలి, ఇప్పుడేమీ అక్కర్లేదు కదా..? అనగానే టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘500 మెగావాట్లు కావాలని అడిగాము కదా అన్నారు. మీరండిగింది మార్చిలో.. ఇప్పుడు నవంబర్..ఇప్పుడు పవర్ ఎక్కడిది.. ట్రాన్స్‌మిషన్‌కు కూడా అవకాశం లేదని మంత్రి పేర్కొన్నారు. హరీష్‌రావు కల్పించుకుని అంధ్రప్రదేశ్ లో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా ఇవ్వడం లేదని పిర్యాదు చేశారు. గత వారం మిమల్ని కలసిన టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ అసలు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అడగనే లేదని, పెండింగ్‌లో మా విన్నపాలు ఏమీ లేవని మీరు చెప్పినట్టు చెబుతున్నారు..’ అని చెప్పారు.

ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పీయూష్.. ‘ఈ రాజకీయాలు మానుకోవలని వ్యాఖ్యానించారు. ‘రాజకీయూలు వద్దని ఇద్దరికీ చెబుతున్నా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెబుతున్నా.. వాళ్లకీ చెప్పాను. మీకూ చెబుతున్నా.. ఇద్దరు సీఎంలు కూర్చుని చర్చించుకుంటే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పాను. అక్కడ కాకపోతే.. ఇక్కడ ఢిల్లీకైనా వారిని పిలపించి తాను కూర్చోని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఇలా చేస్తే తెలంగాణకు విద్యుత్ సమస్యతో పాటు.. ఆంధ్రప్రదేశ్ కు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles