Deadline app which defines the death day of humans accroding to the detials of health kit available in iphone

deadline app, deadline application, iphone, iphone 6, iphone 6 plus, just llc company, just llc deadline app, iphone health kit, iphone applications

deadline app which defines the death day of humans accroding to the detials of health kit available in iphone

మీరెప్పుడు చనిపోతారో తెలుసుకోవాలనుందా..?

Posted: 11/03/2014 09:31 PM IST
Deadline app which defines the death day of humans accroding to the detials of health kit available in iphone

ఇది మూఢనమ్మకం కాదు... నిజం! నిజానికి ప్రతిఒక్కరికి భవిష్యత్తులో తమకు ఏం జరగబోతోందోనన్న విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి ఖచ్చితంగా వుంటుంది. అలాగే తాను ఎంతకాలం బతుకుతానో.. ఎప్పుడు చనిపోతానని తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా వుండడ సాధారణం! కానీ అదంతా సాధ్యంకాదు. సృష్టికి వ్యతిరేకంగా పనులను చేపడితే అది మానవాళికే హాని అని అంటుంటారు పెద్దలు. అసలు దానిని తెలుసుకోవడం కూడా అసాధ్యం! కానీ మరణతేదీని తెలుసుకోవడం చాలా సులభమని జస్ట్ ఎల్ఎల్సీ సంస్థ తెలుపుతోంది.

జిస్ట్ ఎల్ఎల్సీ అనే సంస్థ తాజాగా ఓ ‘‘డెడ్ లైన్’’ అనే యాప్ ను కనుగొంది. ఈ యాప్ ను ఐఫోన్ లో అప్ లోడ్ చేసుకుంటే.. అది అందులో వున్న మీ హెల్త్ కిట్ టూల్ నుంచి మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి.. మీరు ఏరోజు మరణిస్తారో చెప్పేస్తుంది. వాస్తవానికి ఏ యాప్ కూడా ఖచ్చితమైన మరణ తేదీని చెప్పలేదని.. కానీ ఇది మాత్రం ఆరోగ్యపరిస్థితిని అంచనా వేసి అవసరమైన పక్షంలో వైద్యుడిని సంప్రదించాలని కూడా సూచిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. అంటే.. ఆరోగ్య పరిస్థితి ప్రకారం ఆయు:ప్రయాణం అంచనా వేస్తుందని వాళ్లు చెబుతున్నారు.

అలాగే హెల్త్ కిట్ టూల్ లో సమాచారాన్ని బట్టి ఈ యాప్.. ఎంతసేపు పడుకుంటున్నారు..? రోజుకు ఎంత నడుస్తున్నారు..? ఎత్తు, బీపీ వంటి వివరాల ఈ యాప్ లెక్కకట్టేస్తుందని చెబుతున్నారు. అదెలా అంటే.. టూల్ కిట్ లో వున్న సమాచారాన్ని ఉపయోగించి.. మీకు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది. అందుకు మీరిచ్చిన సమాధానాల ప్రకారం దాదాపు మీ మరణతేదీని అంచనా వేసి చెబుతుందని అంటున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆయువు పెంచుకోవచ్చని ఈ యూప్ రూపకర్త జస్ట్ ఎల్ఎల్ సీ సంస్థ పరిశోధనల అనంతరం తెలుపుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deadline app  just llc company  iphone  death day application  

Other Articles