All political parties say no to government formation delhi heads for fresh polls

Delhi Assembly, Election management, The BJP, AAP, Congress Averse, Delhi Lieutenant Governor Najib Jung, Delhi Assembly canceled, president rule

All say no to government formation, Delhi heads for fresh polls

మరో పర్యాయం ఎన్నికలకు సిద్దమవుతున్న హస్తిన అసెంబ్లీ..

Posted: 11/04/2014 09:59 AM IST
All political parties say no to government formation delhi heads for fresh polls

హస్తిన శాసనసభకు మళ్లీ ఎన్నికల నగరా మ్రోగనుంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో..  మరోమారు ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారనుంది. తాజాగా ఎన్నికల నిర్వహణ దిశగా పరిణామాలు సాగుతున్నాయి. ఢిల్లీలో దీర్ఘకాలం పాటు రాష్ట్రపతి పాలన కోనసాగడంపై గత నెలలో సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయుడంపై తవుకు ఆసక్తిలేదని, ఎనిమిది నెలల రాజకీయ అనిశ్చిత పరిస్థితికి అంతం పలుకుతూ తాజాగా ఎన్నికలు నిర్వహించాలని శాసనసభలో అత్యధిక స్థానాలున్న అతిపెద్ద పార్టీ బీజేపీతోపాటు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ స్పష్టం చేశాయి. దీంతో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు అనివార్యం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

ప్రభుత్వం ఏర్పాటు అవకాశాల అన్వేషణలో భాగంగా, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మూడు పార్టీలతోనూ చర్చలు జరిపారని, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా లేవని చర్చల్లో తేలిందని లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల నేతలతో జరిపిన చర్చలపై తన నివేదికతోపాటు, అసెంబ్లీని రద్దు చేయవలసిందిగా కోరుతూ సిఫార్సులను లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి సమర్పించనున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలను అన్వేషించాలని, ఈ నెల 11లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు లెఫ్టినెంట్ గవర్నర్ సోమవారం మూడు పార్టీల నేతలతో చర్చించారు.

సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్‌తో జరిపిన సవూవేశంలో బీజేపీ తరఫున సతీష్ ఉపాధ్యాయ్, జగదీశ్ ముఖి, ఆప్ తరఫున కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా,  కాంగ్రెస్ తరఫున హరూన్ యూసుఫ్ పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లుండగా,  ఇటీవల లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యూరు. ప్రస్తుతం  అసెంబ్లీలో 67 మంది ఎమ్మెల్యేలే  ఉన్నారు. వీరిలో బీజేపీకి 29 వుంది, ఆప్‌కు 27వుంది, కాంగ్రెస్‌కు 8 వుంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ‘మ్యాజిక్ ఫిగర్’ 34 సీట్లు  ఏ పార్టీకి లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలన్నీ వెనకంజ వేశాయి.

గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 70సీట్లకు గాను బీజేపీ 31సీట్లు గెలిచి, అతిపెద్దపార్టీగా అవతరించినా, అప్పట్లో కూడా సాధారణ మెజారిటీకి నాలుగు సీట్లు తక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ విముఖత చూపింది. దీనితో  కాంగ్రెస్ మద్దతుతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. అయితే, ఆప్ తన ప్రధానమైన అంశంగా పరిగణించే జనలోక్‌పాల్ బిల్లు,.. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకతతో అసెంబ్లీ ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం గత ఫిబ్రవరి 14న రాజీనామా చేసింది. దీనితో ఢిల్లీలో ఫిబ్రవరి 17న రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. కాగా, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయురాదని ఆదివారం పార్టీ కేంద్ర నేతల భేటీలో బీజేపీ నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలి విజయుం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణను వినియోగించుకునేందుకు ఢిల్లీలో కూడా తాజా ఎన్నికలు ఎదుర్కోవాలని పార్టీ నిర్ణయించుకుంది.

ప్రధాని మోదీ కూడా ఎన్నికలకే మొగ్గుచూపారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయరాదని ఆర్‌ఎస్‌ఎస్ కూడా అభిప్రాయపడిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా ఢిల్లీ విషయుంలో నిర్ణయం తీసుకోవాలని తవు పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సూచించినట్టు ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ్ చెప్పారు. కాగా, దీర్ఘకాలం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఢిల్లీ ప్రజల హక్కులను కాల రాస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ విమర్శించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీ ముందుకు రాకుంటే తాజాగా ఎన్నికలు జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles