Rare two chandra s took allai bhalai

allai Bhallai, strenghtens, telugu people, unity, governer, chandrababu, Kcr, bandaru dattatreya

allai Bhallai strenghtens telugu people unity says governor

ఇద్దరు చంద్రుల అరుదైన అలాయ్ భలాయ్

Posted: 10/05/2014 05:09 PM IST
Rare two chandra s took allai bhalai

సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బాలాయ్ కార్యక్రమంలో అరుదైన ఘట్టం చేటుచేసుకుంది. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు అలాయ్ భలాయ్ తీసుకున్నారు. గవర్నర్ నరసింహన్ సాక్షిగా జరిగిన ఈ అరుదైన ఘట్టం చూసిన వారందరూ.. చపట్లతో వారి ఆలింగనాన్ని స్వాగతించారు. అలాయ్ భలాయ్ కార్యక్రమానికి సంపూర్ణత చేకూరిందని హర్షించారు. ఈ కలయిక ఎప్పటికీ ఇలాగే వుండాలని సభికులతో పాటు.. అహుతులు ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు అలాయ్ భలాయ్ తీసుకుని కలిసి ఉంటే తెలుగు వారికి ఎనలేని శక్తి వస్తుందని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. గత పదేళ్లుగా దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని... ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలుగు ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అన్ని పార్టీల వారిని ఒకే వేదికపై తీసుకొచ్చిన ఘనత బండారు దత్తాత్రేయదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. భాష, దేశం, ప్రాంతం మన అనుంబంధాన్ని పెంచుతాయన్నారు. ఐకమత్యం లేకపోవడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని... రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయాం తప్ప మానసికంగా కలిసే ఉన్నామన్నారు. తాను గత 30ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నానని వివరించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తు చేశారు. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్ అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలయ్ బలయ్ సృష్టికర్త దత్తాత్రేయ అని అభినందించారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించడం సంతోషకరమన్నారు. దత్తాత్రేయ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించాలని ఆకాంక్షించారు. మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్ ప్రసంగించి వెళుతున్న సమయంలోఅక్కడికి వచ్చిన చంద్రబాబు, కేసీఆర్ ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాయ్ భలాయ్ తీసుకున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allai Bhallai  strenghtens  telugu people  unity  governer  chandrababu  Kcr  bandaru dattatreya  

Other Articles