Ravela kishore babu takes on raghuveera reddy and botsa satyanarayana

ravela kishore babu, raghuveera reddy, botsa satyanarayana, no right, criticize, ap government, AP Minister, APCC Chief

ravela kishore babu takes on raghuveera reddy and botsa satyanarayana

బొత్సా, రఘువీరలకు ఆ అర్హతే లేదు..

Posted: 10/05/2014 01:23 PM IST
Ravela kishore babu takes on raghuveera reddy and botsa satyanarayana

తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఆ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వారు వారి బాగోగులు చూసుకోవడం మంచిదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ బొత్సలపై అయన విరుచుకుపడ్డారు. వారిద్దరికి ఏ అర్హత ఉందని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశాల్లో ఉన్నవారికి, చనిపోయిన వారికి కూడా పింఛన్లు అందించారని విమర్శించారు. పింఛన్కు అర్హులైన వారి జాబితాను వెబ్సైట్లో పెడతామన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్ వస్తుందని రావెల హామీ ఇచ్చారు.

వైసీపీ నేతలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర వహించకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే సమయాన్ని కేటాయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వకుండా.. ఏదీ చేసినా సరిగ్గా లేదని విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతలు పక్షపాతని, వారి హితం కోసం ప్రభుత్వం రైతు సాధికారిక సంస్థను ఏర్పాటు చేసిందని వివరించారు. పేదలకు తమ ప్రభుత్వం నిత్యం అండగా వుంటుందని చెప్పారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles