Biography of hyderabadi woman manjulatha kalanidhi who started rice bucket challenge against als ice bucket challenge

manjulatha kalanidhi, hyderabadi woman manjulatha kalanidhi, rice bucket challenge, manjulatha kalanidhi rice bucket challenge, als ice bucket challenge, manjulatha biography, manjulatha kalanidhi news, latest telugu news, poor people india

Biography of hyderabadi woman manjulatha kalanidhi who started rice bucket challenge against als ice bucket challenge

రైస్ బకెట్ ఛాలెంజ్ తో పేదల కడుపు నింపిన తెలుగు మహిళ!

Posted: 09/11/2014 05:22 PM IST
Biography of hyderabadi woman manjulatha kalanidhi who started rice bucket challenge against als ice bucket challenge

ఏఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్ గురించి అందరికీ తెలిసే వుంటుంది... ఎవరో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ కు వచ్చిన వింత వ్యాధిని నిరోధించే కోణంలో కనిపెట్టిన ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్.. నేడు సెలబ్రిటీలంతా దానిని ఒక పబ్లిసిటీ స్టంట్ గా మార్చేసి తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ప్రపంచంలోవున్న ప్రముఖ దిగ్గజాలు నుంచి మన బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ పోటీలలో ఎగబడిమరీ పాల్గొంటున్నారు. విదేశాల విషయం పక్కనపెడితే.. మనదేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీళ్లులేక జనాలు అలమటిస్తుంటే.. సెలబ్రిటీలు మాత్రం వాటిని పట్టించుకోకుండా వున్న నీటిని ఈ ఆట ద్వారా వృథా చేస్తున్నారు. ఇందుకు నిరసనగా ఇతర సెలబ్రిటీలు వినూత్నంగా సందేశాలు ఇచ్చినప్పటికీ వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కానీ.. ఒక్క తెలుగు మహిళ ఆ ఛాలెంజ్ కు ధీటుగానే జవాబిచ్చింది. ఒకవైపు అందరూ నీళ్లను నేలపాటు చేస్తుంటే... అందుకు వ్యతిరేకంగా ఒక మహిళ ‘‘రైస్ బకెట్ ఛాలెంజ్’’ను ప్రారంభించి సామాజిక బాధ్యతను చాటిచెప్పింది.

‘‘రైస్ బకెట్ ఛాలెంజ్’’ను ప్రారంభించిన ఆ హైదరాబాదీ మహిళాపేరు మంజులతా కళానిధి! హైదరాబాద లోనే తన భర్త, కూతురితో వుంటున్న ఈమె.. ప్రతిరోజూ నెట్ లో, టీవీల్లో ఐస్ బకెట్ ఛాలెంజ్ కు సంబంధించి వార్తలు విన్న నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురై... దానికి వ్యతిరేకంగా ఈ ఛాలెంజ్ ను ప్రారంభించినట్లు తెలుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ... మనదేశంలో తినడానికి తిండిలేక బాధపడుతున్నవారూ.. కనీసం బియ్యం ముఖం కూడా చూడనివాళ్లు 30 శాతానికిపైనే వున్నారు. కానీ ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తిచేసే దేశం మనదే అయినప్పటికీ.. అది అందక అలమటిస్తున్న పేదలు కోకల్లు. ఈ వైరుధ్యం గురించి ఆలోచిస్తున్న తరుణంలో తనకు ఈ రైట్ బకెట్ ఛాలెంజ్ తట్టిందని ఆమె పేర్కొంది. పేదలకు బియ్యమో, అన్నమో దానం చేసి.. ఇతరులతోనూ అలాగే చేయించాలని నిర్ణయం తీసుకుందని తెలిపింది.

ఈ ఆలోచన తట్టిన వెంటనే ఆమె తన ఇంటి దగ్గర పొట్ట కూటికోసం కష్టపడే వ్యక్తికి 22 కిలోల బియ్యం కొనిచ్చినట్టు తెలిపింది. ఆ ఫోటోని ఫేస్ బుక్ లో పెట్టి.. ‘‘వై వేస్ట్ వాటర్.. వెన్ యూ డొనేట్ రైస్’’ అనే శీర్షికను తగిలించింది. ఆ ఫోటో పెట్టిన గంటలోనే 3000కు పైగా లైకులూ, కామెంట్లు! ఇదంతా చూసి తనకు ఒకాయని ‘‘రైస్ బకెట్ ఛాలెంజ్’’ పేరుతో ఒక ఫేస్ బుక్ పేజీని క్రియేట్ చేసిచ్చారట! ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పేజీ క్రియేట్ చేసిన కొన్ని గంటల్లోనే వెయ్యికిమందికి పైగా స్పందించారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈమె ప్రారంభించిన ఈ ఛాలెంజ్ ను చూసి ఆకర్షితులైన కొంతమంది ఈమెకు మద్దతు పలికారని.. తమకు సాధ్యమైనంతవరకు పేదలకు బియ్యంగానీ, అన్నంగానీ దానం చేయడం ప్రారంభించాంటూ సంతోషంతో తెలుపుతోంది. అంతేకాదు.. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి తన సమీపంలోని ఒక స్వచ్ఛంద సంస్థలకు 9000 ఖర్చు చేసిన బియ్యం పింపించాడు. వాళ్లకిచ్చిన చెక్ ని తన పేజీలో పోస్ట్ చేసినట్లు తెలిపింది. ఇలా పదులసంఖ్యలో బియ్యం అవసరం వున్నవారికి దానం చేస్తూ పేజీలో పోస్ట్ చేయడాన్ని చూసిన ఆమెకు ఎంతో సంతోషం కలిగిందని హర్షం వ్యక్తం చేసింది.

ఇక్కడ ఈమె గురించి చర్చించుకోవాల్సిన అంశాలు చాలానే వున్నాయి. వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె.. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో డిప్లొమా చేశారు. హైదరాబాద్ లోనే ఆంగ్రపత్రికల్లో పనిచేసిన అనుభవం కూడా వుంది. అంతేకాదు.. బియ్యం గురించి పరిశోధన చేసే లండన్ కు చెందిన ఓ వెబ్ సైట్ కి సీనియర్ ఎడిటర్! వివిధ దేశాల్లో వరి దిగుబడిపై అధ్యయనం చేసేవారితో ఇంటర్వ్యూలు చేయడం ఆమె పని! అందుకే ఆమె బియ్యం మీద ప్రజలకు అవగాహన కల్పించే కొన్ని విషయాలను పేర్కొంటోంది. వచ్చే ఏడాది మనదేశంలో బియ్యం ఉత్పత్తి తీవ్రంగా పడిపోయే ఆస్కారముందని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఏడాదిలో సకాల వర్షాలు పడక, నీళ్ల ఇబ్బంది రావడమే ఇందుకు కారణం! కాబట్టి ఇప్పటినుంచే ప్రజలకు సేవ చేసే అలవాటు చేసుకుంటే.. అందరూ ఒక వ్యవస్థగా ఏర్పడి.. పేదల ఆకలి తీర్చినవారవుతారని అంటున్నారు. చివరగా.. కొంతలో కొంతైనా పేదలకు దానం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలని.. అప్పుడే దేశంలో పేదరికాన్ని అదుపు చేయడానికి వీలుగా వుంటుందని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh