The biography of Ravichettu Lakshmi Narasamma మాతృభాష, మహిళావికాసానికి కృషిచేసిన మహిళామణి

The biography of british rule feminist in telangana ravichettu lakshmi narasamma

Ravichettu Lakshmi Narasamma, Feminist of Telangana, Feminist of Hyderabad sansthan, Regional language reformer, Ravichettu Lakmi narasamma denduluru, Ravichettu Lakshmi Narasamma biography, Khammam, Hanmakonda, women development, Ravichettu Rangarao, Literacy, Telangana

Ravichettu Lakshmi Narasamma one of the Feminist from Telangana who also worked hard for the mother Tounge and spread of Local speaking Language while Marathi was predominant in parts of the State.

మాతృభాష, మహిళావికాసానికి కృషిచేసిన మహిళామణి

Posted: 01/30/2021 08:34 PM IST
The biography of british rule feminist in telangana ravichettu lakshmi narasamma

రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి. భాషాభిమానంతో స్వతంత్రానికి పూర్వమే వారు తమ ఇంటిని భాషానిలయంగా మలిచారు. తెలంగాణా సామాజిక పునర్వికాసానికి బీజం వేసిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని రావిచెట్టు రంగారావు, నాయని వెంకటరంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు 1901 సంవత్సరంలో సెప్టెంబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌ బ్రిటిష్‌ రెసిడెన్సీలోని రావిచెట్టు రంగారావు బంగళాలో ప్రారంభించారు.

రావిచెట్టు లక్ష్మీనరసమ్మ ఖమ్మం జిల్లా మధిర ప్రాంతంలోని దెందుకూరుకు చెందిన ఊటుకూరి వెంకటప్పయ్యగారి కుమార్తె. ఆమెకు 8వ ఏటనే రావిచెట్టు రంగారావుతో (1880లో) వివాహమైంది (జాగీర్దార్‌ రావిచెట్టు నర్సింహారావు- వెంకమ్మ దంపతుల ఏకైక కుమారుడు రంగారావు). ఆ దంపతులది హైద్రాబాద్‌లో కాపురం, జీవితం వడ్డించిన విస్తరి. కావల్సినంతగా జీవితాన్ని అనుభవించే అవకాశమున్నప్పటికీ వారు తమ జీవితాన్ని నాటి ఫ్యూడల్‌ కుటుంబాలు అనుసరించే సాంప్రదాయాలకు భిన్నంగా ఆలోచించారు.

బడుగుల బాధల పట్ల అగ్రవర్ణాలవారికి జాలీ, సానుభూతి ఉంటాయితప్ప, సహానుభూతి ఉండదనే అభిప్రాయానికి ఈ దంపతులిద్దరూ గోప్ప మినహాయింపు. రావిచెట్టు రంగారావు, లక్ష్మీనరసమ్మ దంపతులు తమ ఇంట్లో అనేక మంది పిల్లలకు బోభన వసతులు కల్పించి మరీ విద్యావ్యాప్తిని చేశారు. కొంతకాలం తమ బంగళాలోనే నిర్వహించబడ్డ భాషానిలయానికి లక్ష్మీనరసమ్మ తమ సేవలను అందించేవారు. నాటి నిజాం పాలనలోని పలు ప్రాంతాలలో విద్యావకాశాలు తక్కువగా ఉడటంతో రంగారావు సహా అమె తమ బంధువులు, సన్నిహితుల పిల్లలకు తమ ఇంటిలోనే ఆశ్రయమిచ్చి చదువు చెప్పించేవారు. లక్ష్మీనరసమ్మ తామందరినీ తన సొంత బిడ్డలవలె కడుప్రేమతో చూసుకొన్నదని వారి ఆశ్రయంలో పెరిగిన ఆదిరాజు వీరభద్రరావు ఒకానోక సందర్భంలో రాశారు.

నాడు మరాఠీల భాషా దురహంకారినికి నిరసనగా ఆంధ్రజన సంఘం ఏర్పడేంత వరకు తెలంగాణ ప్రజలలో భాషాభిమానాన్ని కొనసాగించింది శ్రీకృష్ణ దేవరాయాంద్ర భాషా నిలయమేననడం అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం తెలుగునేలపై ఆధునిక పద్ధతులలో ఏర్పడిన తొలి గ్రంథాలయమని బ్రిటిష్‌ ఆంధ్రాకు చెందిన గ్రంథాలయోద్యమకారులు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వర రావు  పలుసందర్భాలలో ప్రకటించారు. హనుమకొండలో శ్రీ రాజరాజ నరేంద్రాంధ్రభాషానిలయం 1904లో ప్రారంభమైంది. వీటిస్ఫూర్తితో హైదరాబాద్‌ సంస్థానంలోని తెలుగుప్రాంతాలలో భాషానిలయాల స్థాపన ప్రారంభమైంది.

ఈ గ్రంథాలయాలకూ, ఇతర చందాదారులకూ విజ్ఞానవ్యాప్తికై తెలుగులో గ్రంథ ప్రచురణ కోసం విజ్ఞాన చంద్రికామండలిని 1906-07 సంవత్సరంలో ప్రారంభించారు. ఆ పనిపై రంగారావు- లక్ష్మీనరసమ్మ దంపతులు ఆర్నెల్లపాటు తమ మకాంను మద్రాసుకు మార్చారు. విద్యావంతురాలైన లక్ష్మీనరసమ్మగారు గ్రంథ ప్రచురణలో అవసరమైన సేవలను అందించారు. మద్రాసు నుంచి వచ్చే విజ్ఞానచంద్రికా మండలి పుస్తకాలను రంగారావు దంపతులు స్వయంగా ఒకరు పుస్తకాలు కట్టలు కడుతుంటే మరొకరు చిరునామాలు రాసేవారు.

‘పురుషులతోపాటు స్త్రీల కూడా విద్యావంతులైనప్పుడే దేశము పురోగాభివృద్ది సాధిస్తుందని 18వ శతాబ్దములోనే పిలుపునిచ్చారు లక్ష్మీ నరసమ్మ. ముఖ్యంగా హైదరాబాద్ స్త్రీ‌లు నిరక్షరాస్యులుగా వుండటం చూసిన అమె.. వారిని వృధ్దిలోకి తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేశారు. అప్పుడప్పుడే కొంతమంది యువతులు చదువుకోవడం చేత.. పరీక్షలలో మెరిట్ తో పాస్ అయిన వారికి ప్రోత్సహాక బహుమానాలు ఇచ్చి మరింతగా విద్యాలో రాణించాలని ప్రశంసించేవారు. అయితే ఇలా వారిచ్చిన ప్రాత్సాహకాలు పోందనవారు కూడా మధ్యలో విద్యను అపడంతో లక్ష్మీ నరసమ్మ అశించిన ప్రయోజనం చేకూరలేదు,

దీంతో మహిళలకు విద్యను అభ్యసించేలా మరో మార్గంలో ప్రయత్నం చేశారు లక్ష్మీ నరసమ్మ దంపతులు, కుట్టుపనులు మొదలైన వాటిని నేర్పించి, విద్యాభివృధ్ధిగా తోడ్పాలని ‘ఆంధ్రమహిళా సంఘము’ అనుపేరుతో ఒక సమాజాన్ని ఏర్పాటు చేశారు, ఈ సమాజానికి లక్ష్మీనరసమ్మ కార్యదర్శిగా నియమించారు.. ప్రతి శుక్రవారం రంగారావు బంగళాలో లక్ష్మీనరసమ్మ ఆధ్వర్యంలో జరిగే సమావేశాల్లో గృహనిర్వహణ, శిశుపోషణ, ప్రాతివత్యం, స్త్రీ విద్య, ఐకమత్యం వంటి అంశాలపై చర్చలు, ఉపన్యాసాలు జరిగేవి. అయితే అది కూడా కేవలం ఒక్క ఏడాదికి మాత్రమే పరిమితం అయ్యింది.

మహిళా భ్యుదయం కోసం లక్ష్మీ నరసమ్మ ఎంతో కృషి చేసినా.. ఎంత పాటు పడినా.. అమెలాంటి అలోచనలు వున్న వ్యక్తులు కొందరు అమెకు జతకలిసినా.. అమెలా పనిలో మాత్రం ఉత్సహాన్ని కనబర్చేవారు మాత్రం లేరు. మాతృభాష, గ్రంథాలయోద్యమం, ప్రచురణోద్యమం, మహిళాభివృధ్ధి, దళితజనోద్ధరణ వంటి సామాజికసేవల్లో వైతాళికులుగా కొనియాడబడ్డ రంగారావు నాటి వైద్యులకు అంతుబట్టనివ్యాధితో 1910లో విగతజీవులయ్యారు. భర్త మరణానంతరంకూడా లక్ష్మీనరసమ్మ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ కార్యక్రమాలపట్ల సజీవ సంబంధాన్ని కొనసాగించారు. నిలయానికి సంబంధించిన పత్రికలన్నీ వారి చిరునామాకే వచ్చేవి. తిరిగి లక్ష్మీనరసమ్మ  వాటిని భాషానిలయానికి పంపించేవారు.

హైదరాబాద్‌, హన్మకొండ భాషానిలయాలకు సొంత భవనాలు నిర్మించాలని రావిచెట్టు రంగారావుఎంతగా పరితపించినా ఆయన జీవితకాలంలో ఆ కోరిక నెరవేరలేదు. దీంతో ఆయన ఆశయాన్ని ఎలాగైనా పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో 1915 జాన్‌లో లక్ష్మీనరసమ్మ ‘తామే మందిరము కట్టించి ఇస్తామని చెప్పడంతో భవన నిర్మాణ కార్యక్రమాలకు శంఖుస్థాపన జరిగింది. ఇందుకోసం లక్ష్మీనరసమ్మ భవనం కోసం రూ.3000 ఇవ్వడమే కాకుండా ఇంకనూ ఇవ్వగలనని హామీ ఇచ్చారు. కానీ విధి బలీయమైనది ఆ పుస్తక భవనం పూర్తి కాకుండానే లక్ష్మీనరసమ్మ 1918 అక్టోబర్‌ 24వ తేదీన మరణించారు. దీంతో భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. రంగంలోకి దిగిన భాషాభిమానులు.. ధర్మదాతల నుంచి ప్రత్యేకంగా విరాళాలు సేకరించి 1921 సెప్టెంబర్ లో ప్రారంభించారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles