eswari wins lakhs of hearts with her big goals ఉన్నతలక్ష్యాలతో లక్షల హృదయాలను గెలిచిన ‘తొలి’ యువతి

Untold story of a young tribal woman inspirational

Untold Story Of Eeswari, Untold Story Of A Young Tribal Woman, young woman from tribal community, Kaun banega crorepati, Colors tamil, game shows, Radikaa Sarathkumar, Kodeeswari, nomadic tribal young girl Eeswari, eeswari community certificate, Acchivement, Education, Tamil Nadu, politics

Here is an untold story of a young woman from nomadic tribal community. Her whole family’s livelihood is through performing acts on roads and collecting money from people. She is the first woman to do PG in English Lit from tribal community. Her major goal is to provide education to people from her community and give them exposure to live a better life. The story of Eswari came into limelight as Radhika Sarathkumar invited her to Tamil Crorepathi show. She thanked Radhika and Colours TV Tamil for helping in getting Community Certificate (nomads).

ఉన్నతలక్ష్యాలతో లక్షల హృదయాలను గెలిచిన ‘తొలి’ యువతి

Posted: 01/21/2020 09:44 PM IST
Untold story of a young tribal woman inspirational

ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న మాటను పక్కనబెడితే.. ప్రతీ రూపాయికి.. అర్థకు.. చేయి చాచి మరీ యాచించే ఊరెంబడి బతుకులకు (నోమాడిక్ ట్రైబ్స్) చెందిన అమె.. తన జాతిలోనే వికసించిన పుష్పం. ఊరూరా తిరుగుతూ.. ఎక్కడ ఏ రోడ్డు పక్కనా కొంత స్థలం కనిపించినా అక్కడ తాత్కాలిక గుడిసెలు (డేరాలు) వేసుకుని జీవించే జీవితాలకు అమె ఓ ఆశదీపం. అమెకు చెందినదే ఈ కథ.. ఓ ఈశ్వరి కథ!

ఛత్రపతి సినిమాలో కమేడియన్ వేణు మాదవ్ వేసిన పాత్రకు ఎవరితో వివాహం అవుతుందో తెలుసుగా.. అలాంటి సంచార జాతులకు చెందిన కులంలో పుట్టి.. చిన్నతనం నుంచే వీధుల్లో తిరుగుతూ చేతులు చాచి.. యాచించే కుటుంబంలో జన్మించిన ఈశ్వరి.. పుస్తకాన్ని చేతబట్టి ఏకంగా ఇంగ్లీష్ లిట్ లేచర్ లో పీజీని కూడా పూర్తిచేసింది. తాను కలువ పువ్వులా నీటిపై తేలియాడుతున్నా.. తన వారు ఇంకా బురదలోనే చిక్కుకున్నారని.. వారిని కూడా వెలుగులోకి తీసుకురావాలని అమె తన లక్ష్యంగా పెట్టుకుంది. అమె నిర్ధేశించుకున్న లక్ష్యమే అమెకు లక్షల హృదయాలను దగ్గర చేసింది. ఇప్పుడు ఆమె వారి జాతికే ఓ ఆశాదీపంగా మారింది.

మదురైకి చెందిన మునియాండి, కుమారి దంపతులది యాచకవృత్తి. వాళ్లకి ఐదుగురు పిల్లలు. రెండో సంతానం ఈశ్వరి. రోజుకి వంద రూపాయలు సంపాదిస్తే ఎక్కువ అనుకునే మునియాండి.. కూతురు చదువుతానంటే మాత్రం కాదనలేకపోయాడు. తన కుటుంబంలో ఒక్కరైనా చదవాలనుకున్నాడతను. ఈశ్వరిని పాఠశాలలో చేర్పించాడు. యాచించగా వచ్చిన డబ్బుతోనే ఆ పిల్లని చదివించడం మొదలుపెట్టాడు. ‘చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టమైన అమెకు ఎంతో కష్టానికి ఓర్చి అమెను చదివించారు అమె తల్లిదండ్రులు. తనకు స్కూల్‌కు వెళ్లాలని ఉందని అమె తన నాన్నతో చెప్పాడంతో.. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడామె తండ్రి.

‘‘కానీ సామాజికంగా మాకు గుర్తింపు లేదు. మా కులం ఇదీ అని చెప్పే ధ్రువపత్రాలు లేవు. దాంతో పదోతరగతి పరీక్షకు హాజరుకావడానికి చాలా కష్టపడ్డాను. చదవలేనేమోనని ఎన్నో రాత్రులు ఏడ్చా. పరీక్షఫీజు కట్టాలంటే ఇబ్బందులు ఎదురయ్యేవి. మొత్తం మీద డిగ్రీ పాసయ్యా. నా చదువు వెనుక మా అమ్మానాన్నల కష్టమే కాదు... అన్న, చెల్లెళ్లు, తమ్ముడి కష్టం కూడా ఉంది. నా ఫీజులు, నేను వేసుకునే దుస్తుల కోసం వాళ్లు కూలీలయ్యారు. వాళ్లని చూసినప్పుడల్లా వీరందరికీ భవిష్యత్తులో నేను అండగా ఉండాలి అనుకునేదాన్ని. ఆ కష్టాలిచ్చిన స్ఫూర్తితోనే ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ చేశా’ అని చెబుతుంది ఈశ్వరి.

కొరడాతో ఛటేల్‌... ఛటేల్‌ మంటూ తమనితాము కొట్టుకుంటూ భిక్షమెత్తుకునే 500 కుటుంబాలున్న గ్రామం అది. ఆ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చదువుకోలేదు. అందరూ నిరక్షరాస్యులే. అటువంటి చోట పుట్టిన ఈశ్వరి ఆంగ్లంలో పీజీ చేయడం అంటే చిన్నవిషయం కాదు. కుటుంబం ఎంత త్యాగం చేస్తే ఆ అమ్మాయి ఆ విజయం సాధించిందో తెలుస్తూనే ఉంది. ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది మాత్రం తమిళంలో వస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరురాలు’ కార్యక్రమం ద్వారానే. రాధిక ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

హాట్ సీట్లో కూర్చున్న ఈశ్వరి చకచకా ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పన్నెండున్నర లక్షల రూపాయలు గెలుచుకుంది. ఆ డబ్బు తీసుకుని వచ్చేస్తే తన గొప్పతనమేముంది. అక్కడే తనవాళ్ల కోసం ఏదైనా చేయాలనుకుంది. తన గ్రామవాసులకు సామాజిక పరమైన గుర్తింపును తేవాలనే ఆశయాన్ని హోస్ట్‌ రాధికతో చెప్పింది. దాంతో రాష్ట్రప్రభుత్వం దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ‘కిందటేడాది రోడ్డు ప్రమాదంలో అన్నయ్య చనిపోయాడు. నాన్నకు ఓపిక లేదు. ఈ డబ్బుని నాన్నకే ఇస్తున్నా’ అంటున్న ఈశ్వరి.. గెలుపు, ఓటముల కన్నా తన కుటుంబం, ఊరి ప్రజల సాధికారతే ముఖ్యమంటోంది ఈశ్వరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles