Mumbai girl rupali chavan biography

rupali chavan, rupali chavan latest news, rupali chavan mumbai metr, rupali chavan mumbai metro pilot, rupali chavan pilot, rupali chavan news, rupali chavan latest news, women special stories, telugu news, telugu latest news, telugu women stories, super women stories

mumbai girl rupali chavan biography who is the first girl to be selected as metro rail pilot

యువతులకు ఆదర్శంగా నిలుస్తూ.. శభాష్ అనిపించుకున్న రూపాలీ!

Posted: 09/15/2014 01:50 PM IST
Mumbai girl rupali chavan biography

ప్రస్తుతకాలంలో ఏ అమ్మాయి అయినా తమతమ చదువులు పూర్తయిన అనంతరం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ.. హాయిగా కాలక్షేపం చేయాలనే భావిస్తుంటారు. అయితే ముంబాయికి చెందిన రూపాలీ చవాస్ మాత్రం అందిరాలాగే ఆలోచించలేదు. సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా.. వాటిని లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోయింది. తాను ఆశించిన లక్ష్యాన్ని పూర్తిచేసుకోవడమే కాకుండా.. తల్లిదండ్రుల ఆశయాన్ని నిలబెట్టింది. ఇతర అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన రూపాలీ... అందరూ తనబాటలోనే నడవాలంటూ కోరుకుంటోంది. అబ్బాయిలకంటే అమ్మాయిలు ఏమీ తీసుకుపోరని.. వారికి ధీటుగానే అమ్మాయిలు కూడా ఏమైనా సాధించగలరనే మాటలను వాస్తవం చేసి నిరూపించి.. అందరికీ ఆదర్శంగా నిలిచింది.

మహారాష్ట్రలోని రత్నగిరి అనే మారుమూల పట్టణంలో పుట్టిపెరిగిన రూపాలీ.. ఇంటర్ అయిన అనంతరం ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే మెట్రోరైలును నడపటానికి పురుషులతోపాటు మహిళా పైలట్లను కూడా తీసుకుంటున్నారని తెలిసి.. అందుకు ఈ అమ్మాయి దరఖాస్తు చేసుకుంది. ఈ పదవికోసం వేలమంది మహిళలు, అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా.. అందులో రూపాలీతోపాటు కేవలం మరో ఐదుగురు మాత్రమే ఎంపికయ్యారు. అయితే వారందరిలోనూ రూపాలీనే అతి చిన్న వయస్కురాలు. మొత్తం అరవై నాలుగుమంది బృందంలో సభ్యురాలిగా ఏడాది పాటు తర్ఫీదు తీసుకుంది. కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే మెట్రోరైలు మొదటి పైలట్ గా బాధ్యతలను చేపట్టిన రూపాలీ.. ఇక్కడ నిజంగానే ఒక సరికొత్త ఒరవడికి తెరలేపిందనే చెప్పుకోవాలి.

ముంబయి యూనివర్సీటీ నుంచి ఇంజనీరింగ్ పట్టాపొందిన రూపాలీ.. తాను అనుకున్నట్టుగానే సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించి యువతులకు ఆదర్శంగా నిలిచింది. అక్కడున్న యువతులంతా ఈమె సాధించిన విజయానికి మద్దతు పలుకుతూ.. తాము కూడా రూపాలీలాగే ప్రత్యేక గుర్తింపును సాధించాలనే పట్టుదలను కనబరుస్తున్నారు. రూపాలీ కూడా ఇతర అమ్మాయిలందరూ తన బాటలోనే నడవాలనే స్ఫూర్తిదాయక సూచనలివ్వడం అందరినీ ఉత్తేజపరుస్తోంది. దీంతో ఈమెను శభాష్ అంటూ ప్రతిఒక్కరు పొగిడేస్తున్నారు. సమాజంలో అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు కూడా సమాన గౌరవం దక్కాల్సిందేననంటూ ఆమె తమ హక్కును వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rupali chavan  mumbai metro project  rupali chavan mumbai metro  mumbai girls  

Other Articles