Bollywood actress pooja batra

bollywood actress pooja batra,Pooja Batra, Pooja Batra gossip, Pooja Batra articles, Pooja Batra news, Pooja Batra party pics, Pooja Batra wallpapers, Pooja Batra videos, Pooja Batra wiki,Pooja Batrainformation, Pooja Batra interview.

Bollywood Actresses Heroin Pooja Batra.

bollywood actress pooja batra.png

Posted: 11/08/2012 05:56 PM IST
Bollywood actress pooja batra

Pooja_Batraపొడుగ్గా ఉన్న అమ్మాయిల్లో ఎక్కడో కాసింత అబ్బాయితనం తొంగిచూస్తూంటుంది. అందుకేనేమో ఓ వింతైన ఆకర్షణతో వాళ్లు మెరిసిపోతుంటారు. అలా మెరిసి, మురిపించిందా అమ్మాయి. ‘అజానుబాహురాలు ’ అనే పదమేదైనా ఉంటే తనని సంబోధించడానికి నిరభ్యంతరంగా ఉపయోగించండన్నట్టు ఉంటుందామె రూపం. మిస్ ఇండియా కిరీటం కోసం పోటీపడడానికి, కథానాయికగా తెరకెక్కడానికి మాత్రమే కాదు... ఆల్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి కూడా ఆ రూపమే ఆమెకు అపురూపమైన వరమైంది. ఆ బ్యూటీనే పూజా బాత్రా ఇప్పుడెక్కడ ?

తండ్రి సైనికాధికారి. తల్లి ఆ రోజుల్లోనే అందాల రాణి. వీరిద్దరి లక్షణాలనూ అందిపుచ్చుకుంది పూజాబాత్రా. చదువుతో పాటు ఆటపాటల్లోనూ టాలెంట్ చూపేది. అటు రన్నింగ్‌లో రాణిస్తూనే, మిస్ ఇండియా టైటిల్ వేటలో నిలిచింది. మిస్ ఏసియా పసిఫిక్ టైటిల్‌ను గెలుచుకుంది. మన యాడ్ ఇండస్ట్రీ ఆసక్తిని కూడా గెలుచుకుంది. వరుసగా మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. కేవలం 18 సంవత్సరాలకే పార్ట్‌టైమ్ స్టార్ మోడల్‌గా మారిపోయింది. నీళ్లలో జలకాలాడుతూ జనం కళ్లన్నీ తన మీదే నిలిచిపోయేలా చేసుకుని ‘లిరిల్ ’ మగా చేశాక... ఆమె క్రేజ్ పెరిగి పోయింది. ఫలితం... వెండితెర అవకాశం.

‘విరాసత్ ’తో వెండితెర పయనం...

తొలి సినిమా ‘విరాసత్’. అనిల్‌కపూర్ సరసన నటించిన ఆ సినిమాతో మంచి పేరు రావడంతో బాలీవుడ్ నటిగా పూజ ప్రయాణం ప్రారంభమైంది. అటు తర్వాత మలయాళం, తమిళ భాషల సినిమాలతో పాటు రంగస్థలం పైనా తనదైన ముద్ర వేసింది. ఉత్తర అమెరికాలో పర్యటించి నప్పుడు అక్కడ నాటకాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాదాపు 22 సినిమాల్లో నటించిన పూజ... తెలుగు తెరకు పరిచయం అయింది మాత్రం ‘గ్రీకు వీరుడు ’ చిత్రంతో. తరువాత నాగార్జున సరసన సిసింద్రీ చిత్రంలో ‘హలో పిల్లా టైమెంతయ్యిందో చూశావా ’ పాటలో నర్తించింది. ఆ పాట హిట్టయినా ఆ తర్వాత ఎందుకో మరి తెలుగులో పెద్దగా కనిపించలేదు. ‘తాజ్‌మహల్-ది ఎటర్నల్ లవ్ ’లో నూర్జహాన్‌గా మెరసిన ఈ బ్యూటీక్వీన్... ఆ తర్వాత హిందీ సినిమాలకూ దూరమైంది. ఎంతగా అంటే ఏడేళ్లుగా ఒకే ఒక్క సినిమా చేసింది. నిర్విరామంగా కొనసాగుతూ వచ్చిన ఆమె కెరీర్‌కు ఎందుకు బ్రేక్ పడింది ? పదేళ్ల ఆమె సినీప్రస్థానం... ఒక్కసారిగా ఎందుకు నిశ్చలమైపోయింది ?

పెళ్లి... విడాకులు... సమాజసేవ...

poojaమూడు సినిమాలు ఆరు కేరెక్టర్లు అన్నట్టు హ్యాపీగా సాగిపోతున్న పూజ సినిమా జీవితంపై వ్యక్తిగత జీవితం ప్రభావం చూపింది. సినిమా కెరీర్ ఉద్ధృతంగా ఉన్న దశలోనే అమెరికాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సోనూ అహ్లూవాలియాను పెళ్లాడిన ఆమె, కొంత కాలం తర్వాత వైవాహిక బంధానికి దూరమైంది. సినిమా అవకాశాలనూ కాదనుకుంది. మరి ఇప్పుడేం చేస్తోంది?

‘‘హాలీవుడ్‌కి, బాలీవుడ్‌కి మధ్య వారథిగా వ్యవహరిస్తున్నాను’’అంటున్నారు పూజ. అమెరికాలో అత్తవారింట ఉండగా హాలీవుడ్ ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలను ఉపయోగించుకుని తనకు తెలిసిన బాలీవుడ్ నిర్మాతలకు అవసరమైన ‘హాలీవుడ్’ సేవలను (హాలీవుడ్ నటులను తమ సినిమాల్లో కోరుకునే నిర్మాతలకు పరిచయం చేయడం వంటివి) అందిస్తున్నారామె. ప్రస్తుతం పూజాబాత్రా వయసు 35. బాలీవుడ్ ప్రమాణాల ప్రకారం చూస్తే అంత పెద్ద వయసేం కానప్పటికీ... గ్లామర్ రంగానికి దశల వారీగా దూరమవుతూ సమాజసేవకు దగ్గరవుతున్నారు. ఎయిడ్స్‌పై పనిచేస్తున్న ముక్తి ఫౌండేషన్‌తో చేతులు కలిపారు. బోంబే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అనాధ బాలల కోసం, కాశ్మీర్‌యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక ప్రయోజనార్థం తీసిన ‘మై లిటిల్ డెవిల్ ’ అనే ఆంగ్లసినిమా ద్వారా సేకరించిన నిధులను నిరుపేద చిన్నారుల ఆశ్రయం కోసం ఉపయోగించారు.వెండితెర పిలుపులకు మురిసిన నాటి పూజాబాత్రా ప్రస్తుతం తన జీవితానికో పరిపూర్ణత సాధించుకునే పనిలో ఉన్నారు. ఆట పాటలతో అలరించిన నాటి రోజులకు భిన్నంగా ఆపన్నులను ఆదుకునే నేటి రోజుల్ని ఆమె మరింత ఆస్వాదిస్తున్నారు. ఈ అందాల నటి జీవితం మరింత మందికి స్ఫూర్తి కావాలని, మరెందరో నిస్సహాయుల జీవితాలకు వెలుగురేఖ కావాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ability foundation founder jayashree raveendran
Former paturi kranti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles