Ability foundation founder jayashree raveendran

Jayashree Raveendran, Ability Foundation, xecutive director , bility Foundation Founder,

Jayashree Raveendran, executive director of Ability Foundation, which is for uplifting women of today, the first thing she would do( if I had the power to do so) would be the imposition of ban on all the soap operas aired on television, all of which convey that women were invented only to serve men

Ability Foundation founder Jayashree Raveendran.png

Posted: 11/14/2012 03:56 PM IST
Ability foundation founder jayashree raveendran

Jayashree

వికలాంగులంటే అందరిలా పనిచేయలేని వారు అనా? కాదు, అందరూ చేసే పనిని, అందరూ చేసే పద్ధతిలో కాకుండా మరో మార్గంలో చేసేవారు. అందుకే జయశ్రీ వారిని డిజేబుల్డ్ అనరు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. భిన్న మార్గంలో పనిపూర్తి చేయగలిగిన వారంటారు. ఈ జయశ్రీ ఎవరు ? సమాజానికి ఒక ఆదర్శనీయ మార్గం చూపాలని ఎందుకు అనుకున్నారు?ప్రతి మనిషికీ ఈ సమాజం నుంచి ఒకే రకమైన సహకారం అందదు. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ న్యాయం జరుగుతుంటుంది. నిజానికి వికలాంగులకు దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటారు కాని వారికి నిజంగా అన్యాయం చేసేది సమాజమే. ఎందుకంటే వారికి వికలత్వం ఉన్నా కూడా సాధారణ వ్యక్తులతో పోటీ పడగల అదనపు సామర్థ్యాలను దేవుడు ప్రసాదించాడు. కానీ, సమాజం మాత్రం సహకారం మానేసి సానుభూతి చూపుతుంది. జన జీవన స్రవంతిలో కలుపుకోవడం మానేసి జాలి చూపుతుంది. ‘మాపై జాలెందుకు?’... ఇదీ ఇటీవల వారిలో వస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నను సంధించే ప్రతినిధిగా ముందుకు వచ్చారు జయశ్రీ రవీంద్రన్.

కేరళలోని పాలక్కాడ్ ఆడపడుచు జయశ్రీ. చెన్నైలో జాబ్ చేసుకుంటున్న జయశ్రీకి వికలాంగులను ఈ సమాజం చూస్తున్న కోణం నచ్చలేదు. తనకు సరిగా వినపడకపోవడం వల్ల తనలాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా సులువుగా అర్థమయ్యాయి. అందుకే ఆ కోణాన్ని సమూలంగా మార్చివేయాలను కున్నారు.అంతే, ఉద్యోగం పక్కనపెట్టి వారికోసం నిలబడ్డారు. ఇంగ్లిష్ సాహిత్యంలో పీహెచ్‌డీ చేసిన జయశ్రీకి ప్రపంచమంతటా పరిస్థితి ఎలా ఉందో, మనదేశంలో అలా లేదన్న సంగతి అర్థమైంది. ముందు తానేం చేయగలదో తెలుసుకుంటే, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. అందుకే ముందుగా ‘ఎబిలిటీ’ ఫౌండేషన్ నెలకొల్పారు. డిఫరెంట్లీ ఏబుల్డ్‌కు ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి ‘ఎబిలిటీ’ సిద్ధంగా ఉంటుంది. ఆ సంస్థ తరఫున తమలాంటి వారి శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఆ మార్గంలో పుట్టుకొచ్చిందే ‘ఎబిలిటీ’ పత్రిక. సమాజం వికలాంగులు అనుకుంటున్నవారు ఎంత సమర్థులో, వారు సాధిస్తున్న విజయాలేంటో కళ్లకు కట్టే పత్రిక ఇది. వారు అవకాశాలిస్తే ఎదిగేవారే కాదు, అవకాశాలు సృష్టించుకునేవారు, సృష్టించేవారని నిత్యం చాటే పత్రిక ఎబిలిటీ. ‘అయినా ఈరోజుల్లో శారీరక శ్రమకు చోటెక్కడుంది? ఉన్నదంతా మేధో శ్రమే. అందులో మేము ఎవరికీ తీసిపోం, పనిచేసేది శరీరం కాదు, ఆలోచనే!’ అంటారు జయశ్రీ.

ఎందెందు చూసినా..

ఎబిలిటీ ఫౌండేషన్ ఏ ఒక్క పనికో పరిమితం కాలేదు. దేశంలోనే ‘ఎంప్లాయబిలిటీ ’ అనే ఓ కొత్త ప్రక్రియకు తెరలేపింది. నౌకరీ, కెవిన్‌కేర్, పీఎన్‌బీ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో కేవలం వికలాంగుల కోసమే ఏర్పాటుచేసిన ఉద్యోగ మేళా ఇది. ఈ మేళా తరచుగా జరుగుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ వ్యక్తులు ఇందులో పాల్గొని తమ సామర్థ్యాలు నిరూపించుకుంటే, మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. చెన్నైలో 2004లో జరిగిన తొలి ఉద్యోగ మేళాలో 36 కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్నాయి. తర్వాత వీటి సంఖ్య, అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితమే హైదరాబాదులో కూడా ఈ జాబ్ మేళా జరిగింది. జాబ్ ఫెయిర్‌కు వస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ వారు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌లో ఈ ఏడాది నిర్వహించినట్లు చెప్పారు జయశ్రీ.కేంద్ర ప్రభుత్వం చేసిన ‘పర్సన్స్ విత్ డిజేబిలిటీ 2011’ చట్టం రూపకల్పనలో జయశ్రీ కీలక పాత్ర పోషించారు. వికలాంగుల కోసం ఫిల్మ్ ఫెస్టివల్ (పాత్రలు, పాత్రధారులు, రూపకర్తలు వారే), వారికోసం ఒక రేడియో, ప్రత్యేక రేడియో కార్యక్రమాలు, వారికోసం ప్రత్యేకమైన అవార్డులు... ఇవన్నీ జయశ్రీ సృష్టించిన ఓ కొత్త ప్రపంచంలో భాగం.
‘మాకు తెలుసు మేము సమర్థులమని, మీరూ తెలుసుకోండి’ అని ఆమె తన చేతలతో నిరూపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangalore mother teresa
Bollywood actress pooja batra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh