Samaikyandra sega four mlas resign

samaikyandra sega-four mlas resign, congress party mlas, cm kiran kumar reddy,

samaikyandra sega-four mlas resign

పిండప్రదానం-ఎమ్మెల్యేల రాజీనామా

Posted: 08/09/2013 08:21 PM IST
Samaikyandra sega four mlas resign

సమైక్యాంధ్రకు మద్దతుగా నలుగురు శ్రీకాకుళం ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు ధర్మాన, భారతి, జగన్నాయకుడు, సత్యవతి తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ విశ్వప్రసాద్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ తమ ప్రాంత ప్రజల నిర్ణయం మేరకే రాజీనామా చేశామని, విభజన ఆపాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర విభజనపై సీఎం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ధర్మాన పేర్కొన్నారు. విభజిస్తే ఆంధ్రప్రదేశ్ బలహీనపడుతుందని ఆయన చెప్పారు.

 

పిండప్రధానం

సమైక్యాంద్రకు మద్దతుగా గిరిజన ప్రాంతంలో ఉద్యమం ఉపందుకుంది. అరకులోయలో నిర్వహించిన కేసిఆర్, సోనియాగాంధీ, దిగ్విజయ్ సింగ్ ల శవయత్రకి కొనసాగింపుగా ఈరోజు పిండప్రధానం చేశారు. సమైక్యాంద్ర జేఏసీ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమనికి పెద్దసంఖ్యలో ప్రజలు హాజరై తమ మద్దతుని తెలియజేశారు. సంప్రదాయబద్దంగా పిండప్రదానం చేసిన అనంతరం పెద్ద కర్మను పురస్కరించుకొని అంతా సహపంక్తి భోజనాలను చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మండి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనని తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గిరిజన ప్రాంతానికి ప్రాతినిద్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, బాలరాజలిద్దరూ , తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more