రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం మాఫియా కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచనున్నది. ఈనెల 21 తర్వాత మరిన్ని అరెస్టులకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిసింది. బినామీ పేర్లతో మద్యం దుకాణాలను నిర్వహించడంతోపాటు సిండికేట్ల ముసుగులో అక్రమ వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులను వారి అనుచరులను గత జనవరిలో అరెస్టు చేసింది. ముడుపులు తీసుకుంటూ వారికి సహకరిస్తున్న పలువురు ఎక్సైజ్ అధికారులను కూడా ఏసీబీ అరెస్టు చేసింది. ఈ ఉదంతం మద్యం బినామీల వెన్నులో వణుకు పుట్టించింది. ఆ తర్వాత ఏసీబీ కొంతకాలం స్తబ్దుగా వున్నా శ్రీకాకుళం జిల్లాలో బినామీ పేర్లతో 40కిపైగా మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న ఆరోపణలపై నగరంలో నివసిస్తున్న మేకా శ్రీనివాసరావును అరెస్టుచేయడంతో వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. ఏసీబీ దాడుల విషయం ముందుగానే లీకవడంతో కొంతమంది బినామీలు ఏసీబీ అధికారుల వల నుంచి తప్పించుకున్నారు. తప్పించుకున్నవారికి సంబంధించిన సమాచారంతోపాటు వారి సన్నిహితులు, బంధువులు, రోజువారీ అలవాట్లకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఇప్పటికే సేకరించినట్టు తెలిసింది. గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా ఈసారి పనిచక్కబెట్టాలని భావనలో ఏసీబీ అధికారులు వున్నట్టు తెలుస్తోంది.
ఉత్తరాంధ్రపరిధిలో బినామీలపేర్లతో వ్యాపారం సాగిస్తున్నట్టు 17 మందిని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మేకా శ్రీనివాసరావు అరెస్టుతో ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న మద్యం వ్యాపారులకు ముడుపుల ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తాజా మాజీ కార్పొరేటర్ శరగడం చినప్పలనాయుడును ఏసీబీ ఆదేశించడం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏసీబీ అధికారులకు చిక్కితే జైలుకెళ్లడం తథ్యమని భావించిన మద్యంవ్యాపారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నారు. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు విహారయాత్రల పేరిట దూర ప్రాంతాలకు వెళ్లిపోవాలనే ఆలోచనలో పడ్డారు. ఇప్పటివరకూ ఉపయోగించిన ఫోన్లు, సిమ్‌కార్డులను సైతం మార్చేస్తున్నట్టు కొంతమంది పేర్కొంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఇతరప్రాంతాలకు వెళ్లి గడుపుతున్నట్టు సమాచారం. మద్యం వ్యాపారులకు సంబంధించిన కదలికలు, ఇతర సమాచార సేకరణ కోసం ప్రత్యేక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. వచ్చేనెల ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈలోపే బినామీల పనిపట్టాలని ఏసీబీ కృతనిశ్చయంతో ఉంది.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more