Yoga Day Special your Health At Your Finger Tips

Yoga best medicine for health

Yoga Special, Yoga Health, Yoga Health Tip, International Yoga Day, International Yoga Day June 21, Yoga Perfect Health Tip, Yoga Day India, India Yoga Day, Yoga Profits, Yoga History, International Yoga Day In India

Yoga is about an inexpensive health assurance. International Yoga Day in India 2017.

యాంత్రిక జీవనం.. దివ్యౌషధం

Posted: 06/21/2017 08:10 AM IST
Yoga best medicine for health

బిజీ లైఫ్‌లో కొన్నింటికి రాజీ పడిపోవడం.. ఒత్తడి పెరిగిపోయిందని విసుగెత్తిపోవడం.. ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలు నిత్య జీవితంలో అందరికీ అంతర్భాగమయ్యాయి. దీంతో పరిపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకమైపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శారీరక, మానసిక ఉత్తేజాయినిక యోగా ఓ ఆశాకిరణమవుతోంది. మానసికంగా సర్వోన్నత స్థితికి చేరేందుకు ఆధ్యాత్మికత ఓ మార్గమైతే.. ఆ దారిలో గమ్యాన్ని చేరుకోవడానికి యోగా కూడా అవసరం అవుతున్నది. ఏకాగ్రతతో విజయపథంలో పయనించాలంటే యోగా ఓ దిక్సూచిలా పనిచేస్తున్నది. ఒత్తిళ్లను జయించే సాధనంగా నేడు దేశవిదేశాల్లో చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. యాంత్రిక జీవనంలో యోగా ఓ దివ్య ఔషధంలా పనిచేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలడంతో ఇపుడు అందరి దృష్టి దీనిపైనే పడింది.


యోగా హిస్టరీ...

యోగా.. గురించి భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. అంతకుముందు వేదాల్లోనూ ఉంది. దీన్నే పతంజలి మరింత పవర్‌ఫుల్‌గా చెప్పాడు. ఆ తరువాత బుద్ధుడు, స్వామి వివేకానంద కూడా అదే చెప్పారు. ఇప్పుడు క్రమంగా కొన్ని దశాబ్దాలుగా యోగాకు పూర్వ వైభవం వస్తున్నది. ప్రత్యేకించి ఓ పదేళ్లుగా మరింత ప్రాధాన్యం లభిస్తున్నది. ఆధునిక జీవన శైలి తెచ్చే అనర్థాల నుంచి తెరిపిన పడేందుకు మేలైన, సులువైన మందుగా యోగాను గుర్తించడం ప్రారంభమైంది. భారతీయ యోగాను పశ్చిమ దేశాలూ ప్రేమించడం మొదలెట్టాయి. మన ప్రముఖులు కూడా యోగాకు ప్రాణం పోస్తున్నారు. దీంతో యోగాకు మంచిరోజులొచ్చాయంటున్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది.


యోగా అంటే?

యోగా అంటే కలయిక. జీవాత్మను, పరమాత్మను కలిపేదే యోగా. మైండ్ అండ్ బాడీని సమన్వయం చేస్తుంది. యోగా అనేది నాట్ ఏ ఫిజికల్ వర్క్. యూజ్ అనే పదం నుంచి వచ్చిందే యోగా. ఎక్సర్‌సైజ్‌కు, యోగాకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఎక్సర్‌పైజ్ అనేది ఒక పరికరంపై గానీ వస్తువుతో గానీ ఆయాసం వచ్చే వరకు చేస్తారు. యోగా అలా కాదు పూర్తిగా బ్రీతింగ్ పైన కంట్రోల్ ఉంచాలి. ఈ రోజుల్లో ప్రతి పనిలో ఒత్తిడి ఉంటుంది. దీన్ని అధిగమించడానికి అల్టిమేట్ పరిష్కారం యోగా. ఇదే విషయాన్ని మనసు, శరీరాన్ని అనుసంధానం చేసే ప్రక్రియనే యోగా. అంతేకానీ.. యోగా మనసు, శరీరాన్ని అదుపు చేయదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎలాంటి రుగ్మతలు రాకుండా, లేకుండా చేస్తుంది. పరిసరాలు, పరిస్థితులను కలుపుకొని బతకడం ఎలాగో నేర్పిస్తుందీ యోగా అని చెప్తున్నారు. 

అసలు లాభం ఉందా?

యోగాకు మూలం మన వేదాలు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమే. పతాంజలిని యోగా పితామహ అంటాం. ఆయన ప్రకారం యోగాలో ఎనిమిది పాదాలుంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి ఉంటాయి. యోగా సాధన వల్ల మన శరీరంలోని నిరోటిన్ ధాతువు వృద్ధి చెంది మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిషన్‌ను క్రమబద్దీకరిస్తుంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. యోగా వల్ల శరీరంలో సమతుల్యత కలుగుతుంది. క్యాన్సర్‌లాంటి పెద్ద రోగాలకు యోగాలోని ప్రాణయామ, యోగనిద్ర, మెడిటేషన్ ద్వారా చెక్ పెట్టొచ్చు. యోగా ద్వారా ప్రశాంతతే కాక ఆనందం పొందవచ్చు అని వివరించారు. చాలామంది జబ్బు వచ్చాక యోగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెడతారు. కానీ ఏది రాకుండా హెల్తీగా ఉన్నప్పుడే యోగా ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో కానీ యోగా వల్ల ఎలాంటి నష్టమూ లేదు. ఎండోక్రెనాల్ గ్రంథి పనితీరు సరిగా ఉండాలంటే ఏ వైద్యం పనికిరాదు. కేవలం యోగా వల్లనే సాధ్యమవుతుంది. ఒత్తిడి తగ్గాలన్నా, వెన్నెముక దృఢంగా మారాలన్నా యోగా తప్పనిసరి. రోగనిరోధక శక్తి స్థాయి పెరగాలనుకుంటే యోగాని కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలి అని చెప్తున్నారు.

ఎలా చేయాలి?

యోగా మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుతుందా అంటే మనమీద మనకు నమ్మకం, మన భారతీయ సంస్కృతిపైన విశ్వాసం ఉండాలి. యోగా నేర్చుకోవాలంటే గురువు తప్పకుండా ఉండాల్సిందే. గురుముఖంగా యోగా చేయాలనేది నియమం. ఎనిమిది సంవత్సరాల వయస్సున్న వారి నుంచి యోగా ప్రారంభించవచ్చు. కానీ పిల్లలకు వేరే, పెద్దలకు వేరే ఆసనాలు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడేవారికి ఇంకోరకమైన ఆసనాలుంటాయి.  ఒక భంగిమ వేస్తే లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బీపీ, హెర్నియా ఉన్నవాళ్లు కపిల్‌బాతీ చేయకూడదు. ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ట్రైనర్ అవసరం. కనీసం మూడునెలల పాటైనా నేర్చుకుంటే భంగిమల మీద సరైన పట్టు, అవగాహన వస్తుంది. ఆ తర్వాత ప్రత్యేకించి ఇంతకాలం నేర్చుకోవాలి అన్న నిబంధనలు లేవు, దశలు అంతకంటే లేవు. ఇక యోగాలో థియరీ 5 శాతం వరకు ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. మిగతాదంతా ప్రాక్టీస్ మహిమే!.

ఏమి యోగం?

-యోగా పుట్టిందే మన సంస్కృతి నుంచి. యోగా ఒక మతానికి చెందినది కాదు. ఎందుకంటే ఆక్సిజన్‌ను హిందువులైనా, ముస్లింలైనా ఆక్సిజన్ అనే అంటారు. కాబట్టి దీనికి మతం లేదు. -ఉదయం 4.30 గంటల నుంచి 6.30 నిమిషాల మధ్య యోగా చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అయితే 2 గంటలు సమయం తీసుకున్నాకే యోగ చేయాలి.

-మధ్యాహ్నం, రాత్రి సమయంలో కూడా యోగ చేయొచ్చు. కాకపోతే తిన్నాక 4 గంటల సమయం తీసుకోవాలి. ద్రవ పదార్థాలు తీసుకున్నప్పుడైతే 15 నిమిషాలు ఆగి యోగా చేయొచ్చు.

-పతంజలి యోగాలో ఎనిమిది పాదాలుంటాయి.. అవి.. యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. రాజ్, హఠ్, విక్రమ్, అయ్యంగార్, కుండలినీ, అష్టాంగ్, పవర్, విన్యాస్.. అంటూ యోగాలో చాలా రకాలున్నాయి. ఇందులో మన దగ్గర ఎక్కువగా అష్టాంగ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

-యోగానే చేర్చుకోవాలంటే గురువు తప్పకుండా ఉండాల్సిందే. గురుముఖంగా యోగా చేయాలనేది నియమం. ఎనిమిది సంవత్సరాల వయస్సున్న వారి నుంచి యోగా ప్రారంభించవచ్చు. కానీ పిల్లలకు వేరే ఆసనాలు, పెద్దలకు వేరే ఆసనాలు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడేవారికి ఇంకో రకమైన ఆసనాలుంటాయి

-భంగిమను తప్పుగా వేస్తే మంచి ఫలితం కాకుండా, లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బీపీ, హెర్నియా ఉన్నవాళ్లు కపిల్‌బాతీ చేయకూడదు. ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ట్రైనర్ అవసరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : International Yoga Day  June 21  Health Tip  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more