the healthy nutrient food items which helps to stay away from different types of diseases | rose flower health benefits | coffee benefits

Nutrient foods items to stay healthy and away from different types of diseases

healthy foods, nutrient foods, healthy foods for diseases, nutrient food items, healthy food items, foods for healthy, small healthy problems, rose flower benefits

nutrient foods items to stay healthy and away from different types of diseases : the healthy nutrient food items which helps to stay away from different types of diseases.

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక ఆహారాలు

Posted: 11/24/2015 11:46 AM IST
Nutrient foods items to stay healthy and away from different types of diseases

ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో కాస్తైనా హాని కలిగించే పదార్థాలు కచ్చితంగా వుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు.. ఏదైనా ఒక కూర చేసినప్పుడు అందులో ఉప్పు, కారం, నూనె తదితరాలను తప్పకుండావేస్తాం.. అయితే మరికొందరు మాత్రం వీటిని ఎక్కువ పరిమాణంలో చేర్చుకుంటారు. తద్వారా ఏదో ఒక జబ్బు దరిచేరే అవకాశం వుంటుంది. అలా ఏదో ఒక ఆహారం రూపంలో ఇబ్బందులు తప్పనిసరి. అలాంటివాళ్ళకు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే కొన్ని హెల్దీ వంటకాలను నిపుణులు అందిస్తున్నారు. వాటిని తరచూ ఆమారంలో చేర్చుకుంటే.. నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చునని వారు సూచిస్తున్నారు. మరి.. ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా..

* మూలికా కాఫీ : ఒక పాత్రలో శొంఠి, తేనె, ధనియాలు, మిరియాలు, యాలకులు, ఇంకా దాల్చిన చెక్కలు తదితరాలను సమానమైన పరిమాణంలో తీసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఎండబెట్టి పొడికొట్టాలి. ఈ పొడిని కాఫీ పొడికి బదులుగా వాడాలి. చక్కెరకు బదులు బెల్లం వేసుకోవాలి, ఒక కప్పు కాఫీకి ఒక స్పూను పొడి వెయ్యాలి. ఇది తలనొప్పి, ముక్కుదిబ్బడ లాంటి సమస్యలకు మంచి ఉపశమనం కలిగించడంతోపాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

* తీపి గులాబీ రేకులు : ముందుగా.. తాజాగా వున్న గులాబీ రేకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి, బాగా ఆరిన తరువాత వాటిని తేనెలోగాని బెల్లంపాకంలోగాని పదిరోజులపాటు ఊరనివ్వాలి. తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని తింటే రక్తహీనతను పోగొట్టి శరీరానికి రక్తం పట్టేలా చేస్తాయి.

* వడపప్పు: పెసరపప్పును రెండు గంటలు పాటు నీటిలో నానబెట్టి, ఆ పప్పులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, మిరియాలపొడి, శొంఠిపొడి తదితరాలను వేయాలి. అనంతరం ఈ మిశ్రమంలో ఒక నిమ్మకాయను పిండితే చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి బలాన్నిస్తుంది.

* అటుకుల కొబ్బరి: కావలసినన్ని అటుకులను బాగా కడిగి నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి, వాటిలో తగినంత కొబ్బరి తురుము, బెల్లమును చేర్చాలి. దీన్ని తింటే రుచిగా ఉంటుంది. ఇంకా శరీరానికి బలాన్ని ఇస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy nutrient foods  rose flower benefits  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more