The Health Benefits Of Grains Which Protects From Heart Attack | Grains Home Remedies | Health Tips

Grains health benefits heart attack remedies home made tips

Grains benefits, Grains tips, Grains health tips, Grains home made tips, Grains health tips, health remedies, healthy home made tips, Grains, heart attack tips, cholesterol tips

Grains Health Benefits Heart Attack Remedies Home Made Tips : The Health Benefits Of Grains Which Protects From Heart Attack. These Grains Contains Anti Accidents, Vitamins and Minerals.

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పప్పుధాన్యాలు..

Posted: 10/08/2015 12:40 PM IST
Grains health benefits heart attack remedies home made tips

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కారకాల్లో పప్పుధాన్యాలు కూడా ఒకటి. ఈ పప్పుధాన్యాల్లో శరీరానికి కావలసిన పోషకాలు, న్యూట్రిషన్లు, ఇంకా ఎన్నో ఔషధగుణాలు నిల్వవుంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. చిరుజబ్బుల నుంచి దూరంగా వుండటమే కాకుండా నిత్యం ఆరోగ్యంగా వుండవచ్చునని పలు పరిశోధనలు కూడా స్పష్టం చేశాయి. ఈ పప్పు గింజల్లో ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్, వేరుశెనగపప్పుల్లో వుండే అసంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. కానీ.. ఈ పప్పు గింజ‌లు ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ మితంగానే తీసుకోవాలి. అప్పుడే వీటితో కలిగే ప్రయోజనాలు ఉంటాయి.

ప‌ప్పు గింజ‌ల‌లో ఉండే అన్‌సాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. గుండె లయ తప్పటాన్ని నిరోధించి, గుండెపోటు రాకుండా రక్షిస్తాయి. ముఖ్యంగా ప‌ప్పు గింజ‌ల్లో పీచు స్థాయి కూడా ఎక్కువ‌గా ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గటానికే కాదు కడుపు నిండిన భావనా కలిగిస్తుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం బారినపడకుండా నివారిస్తుంది. వీటిలో మెండుగా ఉండే విట‌మిన్ ఇ రక్తనాళాల్లో పూడికలను నివారిస్తుంది. అందువల్ల గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. జీడిపప్పును ఇతర పప్పులతో కలిపి వంటలో ఉపయోగిస్తే మాంసకృతులన్నీ తీసుకున్నట్టవుతుంది.

పిస్తాలో విటమిన్‌ ఏ, సి, బి6 ఉంటాయి కాబట్టి రోగనిరోధకశక్తినీ పెంపొదిస్తాయి. గాలికి, వెలుతురుకు గురైతే త్వరగా రంగు, రుచి మారిపోతాయి. వేరుశనగల్లో ఒలియెక్‌ కొవ్వు ఉంటుంది. మోనో అసంతృప్తకొవ్వు ఆమ్లాలూ ఎక్కువే. అందువల్ల వీటిని తరచుగా తీసుకుంటే గుండె జబ్బుల బారినపడకుండా కాపాడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు వుండటం వల్లే ఈ పప్పు ధాన్యాలను తరచూ ఆహారాల్లో తీసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Grains benefits  heart attack health tips  cholesterol tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more