Experts Giving Some Tips To Prevent Mouth Bad Smell | Fetorosis Tips | Health Tips | Home Remedies

Fetororis mouth bad smell prevent tips healthy home remedies

Fetororis tips, mouth bad smell tips, mouth bad smell remedies, healthy remedies, health tips, mouth freshness tips, mouth freshness remedies, health tips, health remedies

Fetororis Mouth Bad Smell Prevent Tips Healthy Home Remedies : Experts Giving Some Tips To Prevent Mouth Bad Smell.

నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే...

Posted: 09/22/2015 11:19 AM IST
Fetororis mouth bad smell prevent tips healthy home remedies

చాలామంది నోటి దుర్వాసన సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీనివల్ల నలుగురిలో వున్నప్పుడు మాట్లాడానికిగానీ, నవ్వడానికిగానీ వీలుండదు. ఇటువంటివారు ఎన్నిసార్లు బ్రష్ చేసినా, మెరుగైన టూత్ పేస్టులు వాడినా, మౌత్ ఫ్రెషనర్ లాంటివి ఉపయోగించినా.. నోటి దుర్వాసన తగ్గదు. అవి కొద్దిసేపటివరకు మాత్రమే నోటి దుర్వాసనను కంట్రోల్ చేస్తాయి. ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? ఇందుకు గల కారణాలేంటి? అనే విషయాలపై నిపుణులు పరిశోధించగా.. కొన్ని ఆహారాల వల్ల ఈ సమస్య వస్తుందని కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే నోటిదుర్వాసనకు చెక్ పెట్టే కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చునని వారు చెబుతున్నారు.

* వెల్లుల్లి.. దీనిని వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే.. ఇందులో సల్ఫర్ అనే మూలకం వుంటుంది. దాని కారణంగా నోటి నుంచి, శరీరం నుంచి దుర్వాస వస్తుంది. కనుక వెల్లుల్లిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. లేనిపక్షంలో నోటి దుర్వాసన సమస్య నుంచి విముక్తి పొందలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* పాలు.. నోటి నుంచి దుర్వాసన రావడానికి పాలు కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పాలలో ప్రోటీన్లు ఎక్కువగా వుంటాయి. వీటితోపాటు బ్యాక్టీరియా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి చాలామందికి పడవు. ఇవి పొట్టలో సల్ఫర్ కాంపౌడ్స్‌ని విడుదల చేస్తాయి. పలితంగా అవి నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కాబట్టి.. పాలను రెగ్యులర్ గా తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. పాలలో ఏదైనా మిక్స్ చేసుకుని తాగితే మంచిదని చెబుతున్నారు.

* అన్నిటి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రోడ్డు సైడ్‌లో లభించే కబాబ్స్, జంక్ ఫుడ్‌‌ల జోలికి వెళ్లకూడదని నిపుణుల సలహా! అటువంటి ఆహారాల్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. అవి కూడా నోటి దుర్వాసను కారణమవుతాయని చెబుతున్నారు. కాబట్టి.. వాటి జోలికి వెళ్లకుండా వుండాలని నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fetororis remedies  mouth freshness tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more