Health Experts Giving Some Natural Tips To Get Rid Of Depression Problem | Home Remedies | Health Tips

Natural tips to get rid of depression problem home remedies

Depression tips, Depression remedies, Depression home remedies, Depression problems, Depression escape tips, health tips, home remedies, health home remedies, health tips for Depression, healthy foods

Natural Tips To Get Rid Of Depression Problem Home Remedies : Health Experts Giving Some Natural Tips To Get Rid Of Depression Problem.

డిప్రెషన్ నుంచి విముక్తి కలిగించే సహజ చిట్కాలు

Posted: 08/20/2015 03:05 PM IST
Natural tips to get rid of depression problem home remedies

ప్రస్తుత ఆధునిక యుగం పోటీతత్వంతో కూడినది. ఏదైనా స్థాయి సంపాదించాలంటే కొన్ని లక్షలాదిమందితో పోటీపడాల్సి వుంటుంది. అలాగే ఇంట్లో పనులను నిర్వర్తించుకోవాల్సి వుంటుంది. ఈ విధమైన వాతావరణం ప్రతిఒక్కరిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సమస్య రోజురోజుకు మరింత అధికమవుతుంది. దీని నుంచి ఎంత త్వరగా ఉపశమనం పొందితే అంతే మంచిది.. లేకపోతే ఈ ఒత్తిడితో మానసిక ఆవేదన పెరిగి రకరకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి ప్రభావం మోతాదుకు మించితే అవసరమైతే పిచ్చివాళ్లు కూడా కావొచ్చునని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. దీని నుంచి విముక్తి పొందడం చాలా ముఖ్యం.

తీవ్రమైన డిప్రెషన్‌ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజసిద్ధమైన పద్ధతులు వున్నాయి. తప్పనిసరిగా వైద్య సంబంధమైన అవసరం ఉంటే మాత్రం అందుకు సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. ఈ మందులతోపాటు కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల ఈ ఒత్తిడి నుంచి బయటపడొచ్చని వారంటున్నారు. చాలా మందికి కాఫీ తాగే అలవాటు విపరీతంగా ఉంటుంది. కాఫీ తాగితే మూడ్‌ని బూస్ట్‌ చేయొచ్చని అంటుంటారు. ఇది నిజమే అయినప్పటికీ... చాలా తక్కువసేపు మాత్రమే మూడ్‌ బూస్ట్‌ అవుతుంది. కానీ కొన్నిసార్లు కాఫీ కూడా డిప్రెషన్‌కి కూడా కారణం అవుతుంది. కాఫీ తాగడం వల్ల మెదడులోని రసాయనాలు అస్తవ్యస్తమవుతాయి. కాఫీ ప్రభావం సెరటోనిన్‌ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకని కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. కాఫీలో ఉన్నట్టే గ్రీన్‌టీలో కూడా కెఫైన్‌ ఉంటుంది.

కొన్ని ఆహారపదార్థాలను తినడం వల్ల శరీరంలో సెరటోనిన్‌ స్థాయిని పెంచుకోవచ్చు. సెరటోనిన్‌ డిప్రెషన్‌తో యుద్ధం చేసి దాన్ని పారిపోయేలా చేస్తుంది. ఆహారం ద్వారా సెరటోనిన్‌ చేరాలంటే గుడ్లు, కొబ్బరి నూనె, పుల్లటి చెర్రీలు, అవిసెగింజల నూనె, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాల వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని చెపుతుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Depression  Health Tips  Home Remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more