The Best Nutrition Food For Long Live Healthy Life | Home Remedies | Health Tips

Nutrition food for long live healthy life home remedies

nutrition foods, health tips, healthy foods, nutrition healthy foods, healthy food items, best remedies, home remedies, healthy foods, fast foods, fast food causes, fast food problems, nutrition food items

Nutrition Food For Long Live Healthy Life Home Remedies : Experts saying to take nutrition food everyday to live long live healthy life without any problems.

ఆరోగ్యమైన జీవితానికి పోషకాహారమే మేలు

Posted: 07/30/2015 12:28 PM IST
Nutrition food for long live healthy life home remedies

ప్రస్తుత యుగంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతిఒక్కరు ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడిపోయారు. ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గర్ వంటి వాటినే రెగ్యులర్ డైట్ లో తీసుకుంటున్నారు. మరికొందరు మాత్రం డైటింగ్ ప్లాన్స్ అంటూ అసలు ఆహారమే తీసుకోవడం మానేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరానికి పౌష్టికాహారం అందక రకరకాల అనారోగ్యాల బారిన పడతారు. ఇక ఫాస్ట్ పుడ్ లను నిత్యం తీసుకుంటే.. డయాబెటిస్, స్థూలకాయం వంటి వ్యాధులకు గురై.. రకరకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వ్యాధులు తీవ్రతరమైతే.. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా వుంటుంది.

అలాకాకుండా నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే పోషకాహారం రెగ్యులర్ గా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి మేలు చేసే పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రోటీన్లను కాస్త తక్కువగా వున్న ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యంగా వుండటంతోపాటు ఎక్కువకాలం జీవించవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఈ మేరకు తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ వైద్య నిపుణులు ఓ ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలో మొత్తం కెలరీల్లో 40 శాతం తగ్గించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో, పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా తీసుకున్నప్పుడు కూడా దాదాపు అలాంటి ఫలితమే దక్కుతుందని ఆ అధ్యాయనంలో తేలింది. కాబట్టి.. పిండిపదార్థాలు ఎక్కువగాను, ప్రోటీన్లను కాస్త తక్కువ మోతాదులోనూ వుండే ఆహారాన్ని తీసుకుంటే.. ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారాల్లో తాజాగా వుండే కూరగాయలు, ఆకుకూరలు చేర్చుకోవాల్సి వుంటుంది. వాటిల్లో శరీరానికి కావలసిన పోషకాలు, మినరల్స్, ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఇతర ఔషధగుణాలు దాగివుంటాయి. అవి రకరకాల వ్యాధుల నుంచి దూరంగా వుంచి, ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. అందుకే.. వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండని నిపుణులు సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nutrition foods  health tips  home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more