ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దివ్యౌషధాల్లో ఉసిరికాయ ఒకటి! ఆయుర్వేదానికి ఎంతగానో ఉపయోగపడే ఉసిరికాయను తిని నీటిని తాగితే ఆ టేస్టే వేరు. అందుకే నీటి బావుల్లో ఉసిరికాయ చెట్ల వేళ్లను వేస్తారు. ‘దైవవృక్షం’తో పోల్చే ఈ ఉసిరికాయలను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఓ ఉసిరికాయ తీసుకోవడం వల్ల సరికొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు. అంతేకాదు.. ఇది నిత్యయవ్వనులుగా వుండే టానిక్ లా ఉపయోగపడుతుంది. ఈ కాయ ఎన్నోరకాల అంటువ్యాధులను దూరం చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఈ ఉసిరితో కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
ఉసిరితో కలిగే ప్రయోజనాలు :
* ఈ ఉసిరి గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరంగా వుంచడంతోపాటు ఆ రెండింటికీ బలాన్నిస్తాయి.
* ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీ స్పూన్ తేనెను కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కంటి లోపాలుండవు. కండరాలు బలపడతాయి.
* ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ నేరేడు పొడి, ఒక స్పూన్ కాకరకాయ పొడి చేర్చి తీసుకుంటే మధుమేహ వ్యాధిని నయం చేసుకోవచ్చు.
* ఎండిపోయిన ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
* రెండు ఉసిరికాయలను నీటిలో నానబెట్టి ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తే కళ్లు ఎర్రబడటం, దృష్టి లోపాలు వుండవు.
* ఉసిరికాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. వాటిని టెంకాయ నూనెలో బాగా మరిగించి, తర్వాత ఆరనివ్వాలి. దీనిని మాడుకు పట్టిస్తే జుట్టు మృదువుగా తయారవుతాయి.
* ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి. ఆరెంజ్ పండు కంటే ఉసిరిలో 20 రెట్లు విటమిన్ సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more