మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ‘గుండె’. అది ఆరోగ్యంగా వుంటేనే మనిషి సజీవంగా వుంటాడు. అటువంటి గుండెను ఎంత ఆరోగ్యంగా వుంచితే.. అంతే సుఖంగా జీవితాన్ని గడపొచ్చు. సాధారణంగా రోజువారి తీసుకునే చిరుతిండ్లు, తక్కువ పోషకాలు కలిగిన ఆహారాలు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తాయి. అవి గుండెలో అనవసరమైన కొవ్వు పెరిగిపోవడానికి కారణమవుతాయి. దాంతో ‘హార్ట్ ఎటాక్’, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. కాబట్టి.. ఆరోగ్యకరమైన ఆహారాల్ని తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచే కొన్ని హెల్తీ టిప్స్ వున్నాయి. అవేమిటో తెలుసుకుందామా...
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ టిప్స్ :
* గుండెను ఆరోగ్యంగా, పటిష్టంగా వుంచడంలో తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. అటువంటి తేనెను, గోరువెచ్చని నీటితోపాటు కాస్త నిమ్మరసంలో కలుపుకుని పరగడుపున తాగితే ఎంతో మంచిది. ఈ మిశ్రమం శరీరంలోని మలినాలన్నీ వెలికి తీస్తుంది. ఇలా మలినాలు బయటికి వెళ్లిపోవడం వల్ల గుండెకు ఎంతో లాభం చేకూరుతుంది. కాబట్టి.. తేనె కలిపిన నిమ్మరసాన్ని ప్రతిరోజూ తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
* గుండెను ఆరోగ్యంగా వుంచడంలో ‘హెర్బల్ టీ’ ఎంతో తోడ్పడుతుంది. ఎందుకంటే.. ఈ టీలో కెఫిన్ అనే పదార్థం వుండదు. కాబట్టి.. ఈ టీ గుండెకు మేలు చేస్తుంది. దీనిని వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. యాలకుల పొడి వేసిన ‘టీ’ తాగితే గుండె దడ తగ్గి.. అది ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
* గుండెను పదిలంగా వుంచడంలో ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తుంది. వీటిలో పాలీఫేనాల్స్ అనే పోషకం వుంటుంది. అది గుండెను నిత్యం రక్షిస్తుంది. వివిధ రకాల వ్యాధుల నుంచి గుండెను సంరక్షించడంలో అది కీలకపాత్ర వహిస్తుంది. అందులోనూ నల్ల ద్రాక్షలను తీసుకోవడం ద్వారా గుండెకు మేలు చేసినట్లవుతారు. నల్లద్రాక్షల్లో ‘పాలీఫేనాల్స్ శాతం ఎక్కువ మోతాదులో వుంటుంది.
* గుండె చుట్టూ అప్పుడప్పుడు కొవ్వు పేరుకుపోతుంది. అటువంటి కొవ్వును నివారించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. అందుకే రోజు అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం ఇష్టపడని వారు ఆహరంలో వెల్లుల్లి చేర్చుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more